E-Paper
Advertisement

Kane Williamson: మోకాలి గాయం గురించి కేన్ అప్డేట్.. కమ్‌బ్యాక్ ఎప్పుడంటే..?

Kane Williamson: మోకాలి గాయం గురించి కేన్ అప్డేట్.. కమ్‌బ్యాక్ ఎప్పుడంటే..?
Advertisement

Kane Williamson: ఆటలో గాయాలు అవ్వడం కామనే కానీ ఒక్కొక్కసారి ఆ గాయాలు ఆట నుండి చాలాకాలం వరకు ప్లేయర్లను దూరం చేస్తాయి. క్రికెట్‌లో కూడా అంతే. ఒక్కొక్కసారి చిన్న గాయాలతో రెస్ట్‌ కోసం తప్పుకున్న క్రికెటర్లు.. వెంటనే తరువాతి మ్యాచ్ వరకు కోలుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ గాయాలు.. సర్జరీలకు దారితీస్తాయి. ఆపై వారికి చాలా రెస్ట్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పరిస్థితి కూడా ఇదే.

గతేడాది ఐపీఎల్‌లో ఆడుతున్న క్రమంలో కేన్ మోకాలికి గాయమయ్యింది. ఆ తర్వాత ఆ గాయానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటున్నా కూడా తన మనసంతా క్రికెట్‌పై, త్వరలో జరిగే వరల్డ్ కప్‌పైనే ఉంది. పూర్తిగా ఓకే అయిన తర్వాతే గ్రౌండ్‌లోకి అడుగుపెడతానని చెప్తున్న కేన్.. వరల్డ్ కప్ సమయానికి కోలుకోవాలని కోరుకుంటున్నట్టు బయటపెట్టాడు. ప్రస్తుతం వారం, వారం మెల్లగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ పలు విషయాలను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

Advertisement

తనకు ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత పెద్ద గాయం అవ్వలేదని కేన్ చెప్పుకొచ్చాడు. కొన్నిరోజులు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే తను ఇచ్చే సెట్‌బ్యాక్ తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రస్తుతం తను ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ట్రైనింగ్ అవుతున్న వేరే క్రికెటర్లను వెళ్లి కలవడానికి తన సమయం ఉందని, అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు. కచ్చితంగా త్వరలోనే గ్రౌండ్‌లో అడుగుపెడతానని గట్టిగా చెప్తున్నాడు కేన్.

అక్టోబర్, నవంబర్‌లో వరల్డ్ కప్‌ను నిర్వహించడానికి ఇండియా సిద్ధమవుతోంది. ఇంతకు ముందు కూడా న్యూజిలాండ్ టీమ్.. వరల్డ్ కప్‌కు చాలా దగ్గర వరకు వచ్చి ఓడిపోయింది. ఈసారి అలా కాకుండా తానే ఆధిపత్యం వహించి, వరల్డ్ కప్‌ను తన టీమ్‌ గెలిచేలా చేయాలని కేన్ విలియమ్సన్ బలంగా కోరుకుంటున్నాడు. 2023లో ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇస్తానని, వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఆడుతానని కేన్ ధైర్యంగా ఉన్నాడు. తన ఫ్యాన్స్ కూడా వరల్డ్ కప్ సమయానికి కేన్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. తన కూల్ యాటిట్యూడ్‌తో న్యూజిలాండ్‌లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు ఈ కెప్టెన్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×