// //
Josh Inglis Watch: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. మే 30వ తేదీన ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ జూన్ మూడవ తేదీన ఫినిష్ అయింది. అయితే ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ గడ్డపైన నిరాశ ఎదురైంది. అయితే, ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జోష్ ఇంగ్లిస్ ఖరీదైన గడియారాన్ని పాకిస్తాన్ లో ఎవరో దొంగతనం చేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (Josh Inglis) వాచ్ దొంగతనం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా జోష్ ఇంగ్లిస్ వెల్లడించినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. మూడవ వన్డే పూర్తయిన తర్వాత పాకిస్తాన్ స్టేడియంలో… కొంత మంది అభిమానులు ఎగబడ్డారని.. ఈ సందర్భంగా కొంతమందికి షేక్ హ్యాండ్ ( Shake Hand) ఇచ్చానని వెల్లడించారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా తాను షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తన ఖరీదైన వాచ్ కనిపించకుండా పోయిందని బాంబు పేల్చారు. ఎవరు దొంగతనం చేశారో తెలియదు కానీ.. పాకిస్తాన్ లోనే తన లగ్జరీ వాచ్ (Josh Inglis Watch) పోగొట్టుకున్నట్లు ఎమోషనల్ అయ్యారట జోష్ ఇంగ్లిస్. దీనిపై పాకిస్తాన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు గానీ… జోష్ ఇంగ్లిస్ వాచ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.
పాకిస్తాన్ దేశంలో క్రికెట్ ఆడాలంటే కాస్త ధైర్యం ఉండాల్సిందే. ఆ దేశంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు ఉంటాయి. ఉగ్రవాదులు స్టేడియాలపైనే బాంబులు వేస్తారు. అందుకే ఇండియా… పాకిస్తాన్ పర్యటనకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ధైర్యం చేసి పాకిస్తాన్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా… సక్సెస్ ఫుల్ గా తన టూర్ కంప్లీట్ చేసుకుంది. కానీ ఆ జట్టు కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ గడియారం మాత్రం దొంగతనం చేశారు పాకిస్తాన్ వెధవలు. అయితే గతంలో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు జోఫ్రా ఆర్చర్ కూడా ఇదే భయంతో తన బంగారు గొలుసును తీసేసి మ్యాచ్ ఆడాడు. అక్కడ బంగారంతో మ్యాచ్ ఆడితే కచ్చితంగా దొంగతనం చేస్తారని.. ఆర్చర్ భయపడిపోయాడు. అందుకే ముందు జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలో అతడు సేఫ్ గా బయటపడ్డాడు. కానీ జోష్ ఇంగ్లిస్ మాత్రం దొరికిపోయాడు.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు