E-Paper
Advertisement

Joe Root – Sachin: స‌చిన్ కు నిద్ర లేకుండా చేస్తోన్న రూట్..టెస్టుల్లో అత్య‌ధిక అర్థ‌సెంచ‌రీ చేసిన వీరులు వీళ్లే

Joe Root – Sachin: స‌చిన్ కు నిద్ర లేకుండా చేస్తోన్న రూట్..టెస్టుల్లో అత్య‌ధిక అర్థ‌సెంచ‌రీ చేసిన వీరులు వీళ్లే
Advertisement

Joe Root – Sachin: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య యాసిస్ సిరీస్ లో భాగంగా ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఐదవ టెస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొదటినుంచి సచిన్ టెండూల్కర్ కు నిద్ర లేకుండా చేస్తున్న రూట్, తాజాగా సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీల రికార్డు బద్దలు కొట్టే దిశగా దూసుకు వెళ్తున్నాడు. ఐదవ టెస్టులో మరో అర్థ సెంచరీ సాధించిన రూట్, మరో మైలురాయి సాధిస్తే సచిన్ రికార్డు బద్దలు కొట్టడం గ్యారెంటీ. అదే జరిగితే సచిన్ కంటే ఎక్కువ అర్థ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా రూట్ చరిత్ర సృష్టించనున్నాడు.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

అత్యధిక అర్థ సెంచరీలు చేసిన వీరులు వీళ్లే

Advertisement

టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ అత్యధిక అర్థ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 68 అర్థ సెంచరీలు నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత జో రూట్ 67 అర్థ సెంచరీలతో రెండవ స్థానంలో నిలిచాడు. ఇవాల్టి మ్యాచ్ లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్న రూట్, చంద్రపాల్ రికార్డు బద్దలు కొట్టి రెండవ స్థానానికి చేరుకున్నాడు.

ఇక మూడవ స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు చంద్రపాల్ 66 అర్థ సెంచరీలతో ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ 63 అర్థ సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు. అలాన్ బోర్డర్ 63 అర్థ సెంచరీలతో ఐదవ స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఈ టాప్ 5 ప్లేయర్స్ లో రూట్ మినహా అందరూ రిటైర్మెంట్ ప్రకటించారు. మరో రెండు వేలపాటు రూట్ క్రికెట్ ఆడనున్నాడు. అంటే తన అర్థ సెంచరీలను 70కి పైగా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, టెస్ట్ క్రికెట్లో జో రూట్ సాధించిన మైలురాయిని అందుకోవడం కష్టమే.

టెస్టుల్లో మరో రికార్డు సాధించిన రూట్

Advertisement

టెస్టుల్లో మరో రికార్డు కూడా జో-రూట్ సృష్టించారు. టెస్ట్ క్రికెట్ లో 50 కంటే ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. మొత్తం 119 సార్లు 50 కంటే పైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్ టెండూల్కర్ తర్వాత ఇప్పుడు జో రూట్ 107 సార్లు 50 కి పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మరి కొన్ని మ్యాచ్లు ఆడితే సచిన్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు రూట్.

ఇక అటు అత్యధిక సార్లు టెస్టులలో సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 51 టెస్టుల్లో సెంచరీలు నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత కలీస్ 45 సార్లు సెంచరీలు చేశాడు. ఈ లిస్టులో రూట్ 4వ స్థానంలో 40 సెంచరీలతో దూసుకు వెళ్తున్నాడు. ఈ సెంచరీలలో కూడా సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బద్దలు కొట్టే ఛాన్సులే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×