E-Paper
Advertisement

Jitesh Sharma: విరాట్ కోహ్లీ చెత్త ప్లేయ‌ర్‌..ఐపీఎల్ కు ప‌నికిరాడు..ప‌రువు తీసిన జితేష్ శర్మ !

Jitesh Sharma: విరాట్ కోహ్లీ చెత్త ప్లేయ‌ర్‌..ఐపీఎల్ కు ప‌నికిరాడు..ప‌రువు తీసిన జితేష్ శర్మ !
Advertisement

Jitesh Sharma: టీమిండియాలో విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెస్టులు అలాగే టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లో ఆడుతున్నాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ రికార్డులను వరుసగా బద్దలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ పరువు తీశాడు టీమిండియా యంగ్ కుర్రాడు జితేష్ శర్మ ( Jitesh Sharma ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జితేష్ శర్మ, తన డ్రీమ్ ఐపీఎల్ టీమ్ ను ప్రకటించాడు. ఈ లిస్టులో మహేంద్రసింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చిన జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ ( RCB Virat Kohli) పేరును మాత్రం జోడించలేదు. ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ పనికిరాడు అన్న మీనింగ్ వచ్చేలా జితేష్ శర్మ ప్రకటన చేశాడు.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

విరాట్ కోహ్లీ పరువు తీసిన ఆర్సీబీ ఆట‌గాడు జితేష్ శర్మ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు టీమిండియా కుర్ర క్రికెటర్ జితేష్ శర్మ. ఇదే జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం వెనుక జితేష్ శర్మ కష్టం కూడా ఉంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు జితేష్ శర్మ. ఈ దెబ్బకు టీమిండియాలో స్థానం దక్కించుకోగలిగాడు జితేష్ శర్మ. సంజు శాంసన్ లాంటి ప్లేయర్లకు పోటీ ఇస్తూ టీమిండియాలో వికెట్ కీపర్ గా స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు సంజు శాంసన్ ను కాదని ఒకానొక సమయంలో జితేష్ శర్మను కూడా బీసీసీఐ సెలెక్ట్ చేసింది. జితేష్ శర్మను తుది జట్టులో ఆడించింది.

అయితే అలాంటి జితేష్ శర్మ, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరువు తీశాడు. తన డ్రీమ్ ఐపీఎల్ టీమ్ ను ప్రకటించి, విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చాడు. తన ఐపీఎల్ డ్రీమ్ జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం ఇవ్వలేదు జితేష్ శర్మ. కానీ తన డ్రీమ్ జట్టుకు మహేందర్ సింగ్ ధోని కెప్టెన్ అని, రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చాడు. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి లాంటి టీమిండియా కు చెందిన ప్లేయర్లంద‌రినీ తన డ్రీమ్‌ జట్టులోకి తీసుకున్నాడు. కానీ ఆర్సీబీ త‌ర‌ఫున‌ ఆడిన‌ విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయలేదు జితేష్ శర్మ. అంటే విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పనికిరాదని చెప్పే ప్రయత్నం చేశాడు జితేష్ శర్మ.

జితేష్ శర్మ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ :

Advertisement

రోహిత్ శర్మ
ఆడమ్ గిల్‌క్రిస్ట్
సూర్యకుమార్ యాదవ్
జాక్వెస్ కల్లిస్
హార్దిక్ పాండ్యా
ఎంఎస్ ధోని (కెప్టెన్)
ఎబి డివిలియర్స్
వరుణ్ చక్రవర్తి
అక్షర్ పటేల్
జస్ప్రీత్ బుమ్రా
జోష్ హాజిల్‌వుడ్

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×