E-Paper
Advertisement

ముంబై ఇండియ‌న్స్ సారథిగా బుమ్రా..ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్లుగా చేసిన‌ 10 మంది ప్లేయ‌ర్లు వీళ్లే

ముంబై ఇండియ‌న్స్ సారథిగా బుమ్రా..ఇప్ప‌టి వ‌ర‌కు కెప్టెన్లుగా చేసిన‌ 10 మంది ప్లేయ‌ర్లు వీళ్లే
Advertisement

Mumbai Indians Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ధర్మశాల వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అదే ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి మ్యాచ్ కోసం కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు జట్టుకు దూరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకే సీజన్లో ఏకంగా ముగ్గురు కెప్టెన్లను మార్చిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చిన ముంబై యాజమాన్యం… ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇక ఇప్పుడు బుమ్రాను కెప్టెన్ చేశారు. హార్దిక్ పాండ్యా కు వెన్నునొప్పి ఉండగా.. సూర్య కుమార్ యాదవ్ కు ఫ్యామిలీ సమస్యల కారణంగా ఇవాల్టి మ్యాచ్ కు దూరమయ్యారు. అందుకే అనుభవం ఉన్న బూమ్రాకు కెప్టెన్సీ ఇచ్చారు.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

ముంబై ఇండియన్స్ జట్టుకు ఇప్పటి వరకు కెప్టెన్లుగా పనిచేసింది వీళ్లే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 సీజన్ నుంచి ఇప్పటి వరకు అంటే 19 సీజన్లలో మొత్తం పదిమంది కెప్టెన్లను మార్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. 2008 నుంచి 2011 వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్ కొనసాగాడు. అతడే మొట్టమొదటి కెప్టెన్. ఆ తర్వాత షాన్ పొల్లాక్ 2008లో సచిన్ గాయపడినప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. అలాగే హర్భజన్ సింగ్ కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పనిచేశాడు. సచిన్ అందుబాటులో లేని సమయంలో తాత్కాలిక కెప్టెన్ గా 2008లో వ్యవహరించాడు. ఇక 2012 సీజన్ సమయంలో పూర్తిస్థాయి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. 2010లో ఒకే ఒక్క మ్యాచ్ కోసం బ్రావోను కెప్టెన్ చేశారు అంబానీ. 2013 సీజన్ ప్రారంభంలో రికీ పాంటింగ్ కెప్టెన్ గా కూడా కొనసాగాడు.

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో 5 ఐపీఎల్ ట్రోఫీలు

ఇక 2013 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాటు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ 10 సంవత్సరాల రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కు 5 ఐపిఎల్ ట్రోఫీలు దక్కాయి. కిరాన్ పోలార్డు రోహిత్ శర్మ గాయపడినప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా దాదాపు తొమ్మిది మ్యాచ్లకు కొనసాగాడు. ఇక ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కూడా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేనప్పుడు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2024 నుంచి ఇప్పటివరకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా సరిగ్గా ప్రదర్శన చేయడం లేదన్న కారణంతో సూర్యకు కెప్టెన్సీ మళ్ళీ అప్పగించి.. ఇవాళ బుమ్రా బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×