E-Paper
Advertisement

Ravi Shastri comments : ‘అతడు కెప్టెన్ అయితే బాగుంటుంది’.. రవిశాస్త్రి వ్యాఖ్యలు

Ravi Shastri comments : ‘అతడు కెప్టెన్ అయితే బాగుంటుంది’.. రవిశాస్త్రి వ్యాఖ్యలు
Advertisement
Ravi Shastri comments

Ravi Shastri comments : గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విషయంలో అనేక చర్చలు, కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థానంలోకి రోహిత్ శర్మ వచ్చాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు స్వీకరించినందుకు ఫ్యాన్స్ సంతోషించినా కూడా ఇప్పుడు టీమ్ పర్ఫార్మెన్స్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో రవి శాస్త్రీ.. తాను ఎవరిని కెప్టెన్‌గా సిఫారసు చేస్తాడో బయటపెట్టాడు.

Advertisement

ప్రస్తుతం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ టీమ్ పర్ఫార్మెన్స్‌ను చూసిన తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాలా వద్దా అనే విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ, సీనియర్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. మాజీ ఇండియన్ రవి శాస్త్రీ సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ నుండి తప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఆ స్థానం మరో క్రికెటర్‌కు ఇస్తే బాగుంటుంది అంటూ ఒక క్రికెటర్ పేరును సిఫారసు చేశాడు.

వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు బదులుగా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే టీమిండియాను ముందుండి నడిపించే విషయంలో విజయం సాధిస్తాడని రవి శాస్త్రీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా బాగా రాణించలేకపోవచ్చు, కానీ వన్ డేల్లో మాత్రం తను కెప్టెన్‌గా కచ్చితంగా మంచి ప్రతిభను కనబరుస్తాడని అన్నాడు. అక్టోబర్, నవంబర్‌లో జరగనున్న 2023 వరల్డ్ కప్ తర్వాత జరిగే వన్ డేలకు పాండ్యాను కెప్టెన్ చేస్తే బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టాడు.

Advertisement

రోహిత్ శర్మ వరల్డ్ కప్‌కు కెప్టెన్‌గా ఉండడం మంచిదే కానీ వన్ డేల విషయంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశాడు రవి శాస్త్రీ. ఐపీఎల్‌లో కూడా ఇప్పటికే మంచి కెప్టెన్‌గా హార్దిక్ గుర్తింపును సాధించినట్టు గుర్తుచేశాడు. గుజరాత్ టైటాన్స్ అనే టీమ్ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే కెప్టెన్‌గా తన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించి టీమ్ కప్ గెలిచేలా చేశాడు. ఇక 2023లో కూడా ఈ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. మరి రవి శాస్త్రీ చేసిన ఈ వ్యాఖ్యలను బీసీసీఐ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×