E-Paper
Advertisement

IND VS PAK: ఇషాన్ కిష‌న్ తుఫాన్ ఇన్నింగ్స్…పాండ్యా, అభిషేక్ డ‌కౌట్‌, పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే

IND VS PAK: ఇషాన్ కిష‌న్ తుఫాన్ ఇన్నింగ్స్…పాండ్యా, అభిషేక్ డ‌కౌట్‌, పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే
Advertisement

IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ( Team India vs Pakistan Match) మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo ) వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు కుదేలైంది టీం ఇండియా బ్యాటింగ్ లైనప్. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడింది టీమిండియా. 20 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగులు సాధించింది టీమిండియా. ఇక 176 ప‌రుగులు సాధిస్తే పాకిస్తాన్ విజ‌యం సాధించ‌నుంది.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

ఇషాన్ కిష‌న్ తుఫాన్ ఇన్నింగ్స్

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ నాలుగు బంతుల్లోనే డక్ అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ మాత్రం ఇరగదీశాడు. ఈ మ్యాచ్ లో 40 బంతుల్లో 77 పరుగులు సాధించాడు ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్ లో మూడు సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్, పది బౌండరీలు సాధించాడు.

192.50 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు ఇషాన్ కిషన్. దీంతో ఈ కఠినమైన ప్రేమ దాస స్టేడియం పిచ్‌ పైన కూడా భారీ స్కోర్ చేయగలిగింది ఇండియా. అటు తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి. భారీ స్కోర్ చేసేందుకు సూర్యకుమార్ యాదవ్ బాగానే ట్రై చేశాడు. కానీ 32 పరుగులకు అవుట్ అయ్యాడు. శివం దూబే 17 బంతుల్లో 27 ప‌రుగులు సాధించాడు. రింకు సింగ్ 4 బంతుల్లోనే 11 ప‌రుగులు చేశాడు. అటు అభిషేక్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా ఇద్దరు డక్ ఔట్ అయ్యారు. ఈ త‌రుణంలోనే 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు న‌ష్ట‌పోయి 175 ప‌రుగులు సాధించింది టీమిండియా. ఇక 20 ఓవ‌ర్ల‌లో176 ప‌రుగులు సాధిస్తే పాకిస్తాన్ విజ‌యం సాధించ‌నుంది.

మెరిసిన పాక్ స్పిన్న‌ర్లు

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న టి20 మ్యాచ్ లో పాకిస్తాన్‌ స్పిన్నర్లు అదరగొట్టారు. ముఖ్యంగా డేంజర్ ఆల్ రౌండర్ సైమ్ అయూబ్ ( Saim Ayub ) నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టాడు సైమ్ అయూబ్. ఇషాన్ కిషన్, డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి కీలక వికెట్లు తీశాడు. అటు ఉస్మాన్ తారిక్ ( usman tariq) సూర్య కుమార్ యాదవ్ వికెట్ పడగొట్టగలిగాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా… ఏకంగా అభిషేక్ శర్మ వికట్ తీశాడు. షాహిన్ ఆఫ్రిది ఒక వికెట్ పడగొట్టగా మిగిలిన బౌలర్లు తేలిపోయారు.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×