Irfan Pathan: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) విజేతగా బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరించిన పెషావర్ జల్మీ ( Peshawar Zalmi Team) జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం సేన అద్భుతమైన విక్టరీ సాధించింది. దీంతో హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుపై ( Hyderabad Kingsmen Team) ఐదు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసుకొని.. రెండోసారి ఛాంపియన్ అయింది పెషావర్ జల్మీ. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Borad) ఇచ్చిన ప్రైజ్ మనీ పైన (PSL prize money) టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ దారుణంగా ట్రోలింగ్ చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇచ్చిన ప్రైజ్ మనీ (Pakistan Super League prize money)… చిన్నపిల్లల డైపర్లకు కూడా సరిపోవని దారుణంగా కామెంట్ చేశారు ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan). అదే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఒక్కో ప్లేయర్ పై కోట్ల వర్షం కురుస్తోందని వెల్లడించారు. ఇంత తేడా ఉన్నప్పటికీ కూడా PSL గొప్పదంటూ కొంతమంది దుర్మార్గులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. ఈ ప్రైజ్ మనీ చూసి అయినా ఐపిఎల్ జోలికి రాకూడదని హెచ్చరించారు ఇర్ఫాన్ పఠాన్.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కింద బాబర్ ఆజంకు కేవలం 3500 PKR ఇచ్చారని చురకలు అంటించారు. అంటే ఇండియన్ రూపాయలలో అవి కేవలం 1100 రూపాయలు మాత్రమే అవుతాయి. ఈ డబ్బులతో మన దేశంలో చిన్న పిల్లల డైపర్లను కూడా కొనలేమని ఇర్ఫాన్ పఠాన్ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు వచ్చే మొత్తంలో 25% కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ప్రైజ్ మనీ ఇవ్వలేకపోతున్నారని ట్రోల్ చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ 2026 మినీ వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ లాంటి అన్ క్యాప్డ్ ప్లేయర్లను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఆ డబ్బులతో పోల్చితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రైజ్ మనీ దేనికి కూడా సరిపోదు అన్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా నిలిచిన పెషావర్ జల్మీ జట్టుకు 4.7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుకు 2.8 కోట్లు దక్కాయి.
?igsh=MXN3Y2pobGN5bjlzMw==