E-Paper
Advertisement

పోలీసుల‌కు చిక్కిన పాకిస్తాన్ క్రికెట‌ర్…న‌డిరోడ్డున నిల‌బెట్టి క‌డిగిపారేశారు

పోలీసుల‌కు చిక్కిన పాకిస్తాన్ క్రికెట‌ర్…న‌డిరోడ్డున నిల‌బెట్టి క‌డిగిపారేశారు
Advertisement

Irfan Khan Niaz: పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ (Irfan Khan Niaz) పోలీసులకు దొరికిపోయాడు. ఇస్లామాబాద్ హైవేపై వెళ్తుండగా అతని కారును ట్రాఫిక్ పోలీసులు ( traffic police), నడిరోడ్డుపైన ఆపేశారు. క్రికెటర్ గుర్తించని ట్రాఫిక్ పోలీస్ అధికారి… సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదని కడిగిపారేశాడు. ఆ తర్వాత అతడు క్రికెటర్ అని తెలుసుకొని.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ పోలీసులు కూడా గుర్తించ‌లేని స్థితిలో అక్క‌డి క్రికెట‌ర్లు ఉన్నారంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?

పోలీసుల‌కు చిక్కిన పాకిస్తాన్ క్రికెట‌ర్…న‌డిరోడ్డున నిల‌బెట్టి క‌డిగిపారేశారు

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ అంటేనే జోక్ అయిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెటర్ల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. వాళ్లు చేసే చేష్టలపై దారుణంగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొన్నటి వరకు జరగగా… రోజుకో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇంకా ఇప్పుడు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ ట్రోలింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

శుక్రవారం అయిన నేపథ్యంలో జాలీగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి కారులో జర్నీ చేశాడు. ఇస్లామాబాద్ హైవే వేదికగా కారులో ప్రయాణించాడు. అయితే ఈ క్రమంలో అతడు క్రికెటర్ అని తెలియక పోలీసులు ఆపేశారు. సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదని నిలదీశారు. ఈ క్రమంలోనే తన క్రికెటర్ అంటూ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ… అక్కడి పోలీసులకు తెలియజేశాడు. క్రికెటర్ అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ మరింత రెచ్చిపోయాడు. క్రికెటర్ అయితే ఏంటి ? నువ్వు కూడా మనిషివే కదా అంటూ నిలదీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఏ జట్టుకు ఆడుతున్నావ్ ? అంటూ కూపి లాగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు.

హైదరాబాద్ కింగ్స్ మెన్ టీం తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్

Advertisement

ఇర్ఫాన్ ఖాన్ నియాజీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ఆడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో జరిగిన ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ షహిన్స్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2002 డిసెంబర్ 28వ తేదీన పంజాబ్ లో జన్మించిన మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ… ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. త్వరలోనే పాకిస్తాన్ జట్టులోకి కూడా పూర్తి స్థాయిలో సెటిల్ కానున్నాడు.

Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×