E-Paper
Advertisement

RCB Players in SRH: మొద‌ట క్లాసెన్‌, త‌ర్వాత‌ హెడ్..ఇప్పుడు లివింగ్‌స్టోన్..RCB నుంచి వ‌స్తే, కాటేర‌మ్మ కొడుకు అవ‌తార‌మే

RCB Players in SRH: మొద‌ట క్లాసెన్‌, త‌ర్వాత‌ హెడ్..ఇప్పుడు లివింగ్‌స్టోన్..RCB నుంచి వ‌స్తే, కాటేర‌మ్మ కొడుకు అవ‌తార‌మే
Advertisement

RCB Players in SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం నిన్న పూర్తయిన సంగతి తెలిసిందే. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో కొంతమంది పై కోట్ల వర్షం కురువగా, మరికొంతమంది అంచనాలకు మించి ధర పలికారు. ఇంకొందరైతే అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. అయితే ఈసారి ఇంగ్లాండ్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కు భారీ ధర వచ్చింది. మొదటి రౌండ్ లో లియామ్ లివింగ్‌స్టోన్ ను ఎవరు కొనుగోలు చేయలేదు. కానీ సెకండ్ రౌండ్ లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ 13 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో పెద్దగా రాణించని లియామ్ లివింగ్‌స్టోన్ పై ఇన్ని కోట్లు కావ్య పాప అనవసరంగా ఖర్చు పెట్టిందని చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఆర్సీబీ నుంచి వచ్చిన ప్రతి ప్లేయర్ హైదరాబాద్ జట్టులో బాగా రాణిస్తాడని కొంత మంది పోస్టులు పెడుతున్నారు.

Also Read: IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

ఆర్సీబీ నుంచి వచ్చిన ప్లేయర్లు అంద‌రూ కాటేర‌మ్మ కొడుకులే

Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి వచ్చిన ప్రతి ప్లేయర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో బాగా రాణిస్తున్నారు. విధ్వంసకర బ్యాటర్లుగా మారిపోతున్నారు. దానికి ఉదాహరణ, హేన్రిచ్ క్లాసెన్ అలాగే ట్రావిస్‌ హెడ్. ఈ ఇద్దరు కూడా మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడారు. ఆ జట్టులో ఇద్దరు ప్లేయర్లు ఎక్కడ కూడా రాణించిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే హైదరాబాద్ జట్టులోకి వచ్చారో.. వాళ్ళ దశ దిశ మారిపోయింది. కావ్య పాపా జట్టులో సూపర్ స్టార్లు అయిపోయారు. ఇద్దరు బ్యాటింగ్ కు దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన లియామ్ లివింగ్ స్టోన్‌ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. దీంతో వచ్చే సీజన్ లో ప్రత్యర్ధులకు లియామ్ లివింగ్ స్టోన్‌ చుక్కలు చూపిస్తాడని అంటున్నారు.

ట్రావిస్ హెడ్, హేన్రిచ్ క్లాసెన్ కెరీర్

ట్రావిస్ హెడ్ తన ఐపీఎల్ కెరీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోనే ప్రారంభించాడు. 2016 అలాగే 2017 సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు హెడ్. ఆ తర్వాత 2024 నుంచి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, సూపర్ స్టార్ క్రికెటర్ అయ్యాడు. అటు హేన్రిచ్ క్లాసెన్ 2019లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. కానీ అక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక 2023 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడి, తోపు క్రికెటర్ అయ్యాడు. ఇక త్వరలో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేంజర్ ఆల్రౌండర్ గా మారే ప్రమాదం ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: Yashasvi Jaiswal: మ్యాచ్ ఆడుతుండగా కలకలం.. ఆసుపత్రిలో చేరిన జైస్వాల్.. అసలు ఏమైంది అంటే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×