E-Paper
Advertisement

IPL 2026 Auction : చాణుక్యుడి కంటే మేధావి.. పక్క జట్ల పర్సు మొత్తం ఖాళీ చేస్తాడు, ఇంతకీ ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే

IPL 2026 Auction : చాణుక్యుడి కంటే మేధావి.. పక్క జట్ల పర్సు మొత్తం ఖాళీ చేస్తాడు, ఇంతకీ ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే
Advertisement

IPL 2026 Auction : సాధార‌ణంగా ఐపీఎల్ వేలం అంటే అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ లో త‌మ‌కు న‌చ్చిన ఆట‌గాడు ఏ జ‌ట్టులో ఉన్నాడు. మ‌నం ఏ జ‌ట్టుకి అభిమానికి ఉండాలి అని నిర్ణ‌యించుకుంటారు. ఇదంతా అభిమానులు చేసే ప‌ని. కానీ ఐపీఎల్ వేలంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఇత‌ను వేలంలో ప్లేయ‌ర్ల రేటును భారీగా వినాయకుడి లడ్డు లాగా పెంచుతాడు.. చివరకు రేటు బాగా అయ్యాక వదిలేస్తాడు. అత‌ను మ‌రెవ్వ‌రో కాదండోయ్. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కో ఓన‌ర్. ఇత‌ని పేరు కిర‌ణ్ గ్రంధి.

Also Read : IPL 2026 : SRH కెప్టెన్‌ మార్పుపై కావ్య పాప సంచలన ప్రకటన.. వచ్చే సీజన్ కు వస్తున్నాడు

వేలంలో ఇత‌ను ఉంటే.. ప‌క్క జ‌ట్ల ప‌ర్సులు ఖాళీ అవ్వాల్సిందే..!

Advertisement

టీమిండియా కీల‌క ఆట‌గాడు రిష‌బ్ పంత్ ను ఏకంగా రూ.27కోట్ల‌కు అమ్ముడుపోయేలా చేసింది కూడా కిర‌ణ్ గ్రంధినే. దీంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ దెబ్బ ప‌డింది. మ‌రోవైపు కే.ఎల్. రాహుల్, మిచెల్ స్టార్క్, ఏ బీడీ వంటి ప్లేయ‌ర్ల‌ను త‌క్కువ ధ‌ర‌కే మొన్న‌టి సీజ‌న్ లో కొన్నాడు. ఇత‌ను ఈ సారి కూడా చాణ‌క్యుని కంటే తోపు లా ఆలోచిస్తాడు. మంచి ప్లేయ‌ర్ల‌ను త‌క్కువ రేటుకు కొనుగోలు చేయ‌డంలో ఇత‌ను దిట్ట అనే చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా ఐపీఎల్ సీజ‌న్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆడుతుంటే కెమెరాలు అన్ని ఎం.ఎస్. ధోనీ పై ఫోక‌స్ చేస్తుంటాయి. అలాగే ఆర్సీబీ అయితే విరాట్ కోహ్లీ పై, స‌న్ రైజ‌ర్స్ అయితే ఓన‌ర్ కావ్య మార‌న్ పై కెమెరాల చూపు ఉంటుంది. అలాగే ఐపీఎల్ వేలం విష‌యానికి వ‌స్తే.. మాత్రం అంద‌రి దృష్టి కిర‌ణ్ కుమార్ గ్రంథి పైనే ఉంటుంది. ఆయ‌న త‌లుచుకుంటే చాలు.. వేలంలో ఆట‌గాళ్లు ఊహించిన దాని ఎక్కువ రేటు పలుకుతారు. ప్ర‌త్య‌ర్థి ఫ్రాంచైజీల ప‌ర్స్ ఖాళీ అవుతుంది.

రిష‌బ్ పంత్ రూ.27 కోట్ల‌కు అమ్ముడు పోవ‌డానికి కార‌ణం తెలుగోడే..?

ఐపీఎల్ మెగా వేలంలో రిష‌బ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయ‌స్ అయ్య‌ర్ రూ.26.75 కోట్లు ప‌ల‌క‌డానికి కూడా కార‌ణం కిర‌ణ్ కుమార్ గ్రంథి అనే చెప్ప‌వ‌చ్చు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ స‌హ య‌జ‌మాని కిర‌ణ్ కుమార్ గ్రంధి. ఇత‌ను తెలుగోడే కావ‌డం విశేషం. జీఎంఆర్ గ్రూపు మౌళిక వ‌స‌తుల ప్రాజెక్టులు, స్పోర్ట్స్ విభాగాల్లో స‌క్సెస్ సాధించ‌డంలో ఈయ‌న‌ది కీల‌క పాత్ర అనే చెప్ప‌వ‌చ్చు. జీఎంఆర్ కార్పొరేట్ చైర్మ‌న్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ స‌హ య‌జ‌మాని కిర‌ణ్ కుమార్.. జీఎంఆర్ గ్రూపు వ్యాపార సంస్థ‌ల అధినేత గ్రంధి మ‌ల్లికార్జున రావు కుమారుడు. కామ‌ర్స్ గ్రాడ్యుయేట్ చేశాడు. 1999 నుంచి కూడా జీఎంఆర్ గ్రూపు బోర్డులో ఉన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యంతో అనేక ప్ర‌ధాన మౌళిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌ను జీఎంఆర్ గ్రూపు ద‌క్కించుకోవ‌డంలో కిర‌ణ్ కుమార్ కీల‌క పాత్ర పోషించారు. హైద‌రాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, మాలే ప్ర‌ధాన అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల బిడ్ల‌ను జీఎంఆర్ గ్రూపు ద‌క్కించుకోవ‌డంలో ఇత‌ను ప్ర‌ధాన పాత్ర పోషించారు. 2026 వేలంలో కూడా కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి మ‌రీ ఏయే ఆట‌గాళ్ల‌ను త‌క్క‌వ ధ‌ర‌కు కొనుగోలు చేస్తాడో చూడాలి.

Advertisement

Also Read : Yograj Singh: టీమిండియాలో కలకలం..యువరాజ్ తండ్రి ఆత్మహత్యాయత్నం?  

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×