E-Paper
Advertisement

IPL Auction 2026: పృథ్వీ షా, స‌ర్ఫ‌రాజ్‌ UNSOLD..KKR లోకి కామెరాన్ గ్రీన్…ఎన్ని కోట్లంటే

IPL Auction 2026: పృథ్వీ షా, స‌ర్ఫ‌రాజ్‌ UNSOLD..KKR లోకి కామెరాన్ గ్రీన్…ఎన్ని కోట్లంటే
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అబుదాబి వేదికగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైన ఈ మినీ వేలంలో కీలక ప్లేయర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు చాలా మంది అన్ సోల్డ్‌ గా మిగిలిపోతున్నారు. ఈ లిస్టులో పృథ్వీ షా, జాక్ ప్రెజర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన డేవన్ కాన్వే అన్ సోల్డ్‌ అయ్యారు. ఈ ముగ్గురు ప్లేయర్లు మొదట వేలంలోకి రాగా, ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో పృథ్వీ షాతో పాటు మిగిలిన ఆ ఇద్దరు ప్లేయర్లకు షాక్ తగిలింది. అటు డేవిడ్ మిల్లర్ రెండు కోట్లు పలికాడు. రెండు కోట్లకు డేవిడ్ మిల్లర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తెలివిగా దక్కించుకుంది. అతడు గతంలో గుజరాత్ టైటాన్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీకి ఆడ బోతున్నాడు మిల్ల‌ర్‌.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

కేకేఆర్ లోకి గ్రీన్‌…ఎన్ని కోట్లంటే

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ అందరు ఊహించినట్లుగానే భారీ ధర పలికాడు. కామెరాన్ గ్రీన్ ను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. కానీ చివరికి కేకేఆర్ జట్టు కామెరాన్ గ్రీన్ ను 25.20 కోట్లకు దక్కించుకుంది. కామెరాన్ గ్రీన్ ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరి వరకు ట్రై చేసింది. కానీ కేకేఆర్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్రీన్ 25.20 కోట్లు దక్కించుకొని రికార్డు సృష్టించాడు.

సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్ సోల్డ్‌

ఎన్నో అంచనాల మధ్య సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ మినీ వేలంలోకి దిగాడు. సర్ఫరాజ్ ఖాన్ ను ఎవరో ఒకరు కొనుగోలు చేస్తారని అందరూ అంచనా వేశారు. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టైనా కొనుగోలు చేస్తుందని అనుకున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పృథ్వీ షా తరహాలోనే స‌ర్ఫ‌రాజ్‌ కూడా ఎవరు కొనుగోలు చేయలేదు.

Advertisement

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×