E-Paper
Advertisement

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే
Advertisement

IPL 2027 :   క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( Indian Premier League 2027 tournament ) గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ 15 రోజుల ముందు ప్రారంభించేందుకు బీసీసీఐ ( BCCI) రంగం సిద్ధం చేసింది. దీని ప్రకారం మార్చి పదవ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్… మే 15వ తేదీన ఫినిష్ కానుంది అన్నమాట. మే నెలలో తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో 15 రోజులు ముందుగానే టోర్నమెంట్ ఫినిష్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందట. దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ పై ( Indian Premier League 2027 tournament ) బిగ్ అప్డేట్ వచ్చేసింది. వచ్చే సీజన్ ను 15 రోజుల ముందుగానే ప్రారంభించే దిశగా బీసీసీఐ ( BCCI) నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటు మార్చి 28వ తేదీన ప్రారంభమై మే 31వ తేదీన ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలా నిర్వహించడం వల్ల క్రికెటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. మే నెల మ్యాచ్ లు జరిగేటప్పుడు వడగాల్పులతో పాటు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీని వల్ల విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ ఆడటం చాలా ఇబ్బందిగా మారిందట. ఈ మేరకు ప్లేయర్ల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. అయితే సమ్మర్ (Summer) నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంటును రెండు విభాగాలుగా నిర్వహించేలా ముందుగా ప్లాన్ చేశారు.

మార్చి నుంచి ఏప్రిల్ వరకు సగం మ్యాచులు నిర్వహించి.. మిగిలినవి అక్టోబ‌ర్ లో నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్లాన్ వర్క్ అవుట్ కాదని ఓ నివేదిక తేల్చి చెప్పిందట. అందుకే, కాస్త ముందుగా ఐపీఎల్ ప్రారంభించి… ఫినిష్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2027 టోర్నమెంటును మార్చి 10వ తేదీన ప్రారంభించి… మే 15వ తేదీకి ఫినిష్ చేయాలని అనుకుంటున్నారట. ఈ లెక్కన మార్చి 10వ తేదీన తొలి మ్యాచ్ జరగనుండగా, ఫైనల్స్ మే 15వ తేదీన ఉంటుందన్నమాట. ఇలా నిర్వహిస్తే ఎండ తీవ్రత నుంచి ప్లేయర్లు బయటపడవచ్చు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందట బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ను కాస్త ముందుగా నిర్వహిస్తారని వస్తున్న వార్తలపై క్రికెట్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాలకు వెళ్లి మ్యాచ్ చూసే అభిమానులకు కూడా దీనివల్ల రిలీఫ్ దక్కబోతుందని అంటున్నారు.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×