E-Paper
Advertisement

IPL 2026 schedule: ఐపీఎల్ 2026 తొలి ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..RCB, SRH మ‌ధ్య‌నే తొలి మ్యాచ్

IPL 2026 schedule: ఐపీఎల్ 2026 తొలి ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..RCB, SRH మ‌ధ్య‌నే తొలి మ్యాచ్
Advertisement

IPL 2026 schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( IPL 2026) సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్లుగానే మార్చి 28వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. అంతేకాదు మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 28వ తేదీన 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

ఐపీఎల్ 2026 ఫ‌స్ట్ ఫేస్‌ షెడ్యూల్ వ‌చ్చేసింది

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన ఫస్ట్ ఫేస్ షెడ్యూల్ ( IPL 2026 schedule) వచ్చేసింది. మొదట మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీని రెండు రోజులు పెంచి మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ 2026 టోర్నమెంటును ప్రారంభించబోతున్నారు. ఈమెరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మార్చి 28వ తేదీన బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. సెకండ్ మ్యాచ్ మార్చ్ 29వ తేదీన ముంబై వేదికగా కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. ఇలా వరుసగా ఏప్రిల్ 12వ తేదీ వరకు ఫస్ట్ ఫేస్ షెడ్యూల్ జరగనుంది.

ఎన్నిక‌ల షెడ్యూల్ తర్వాతే ఫుల్ షెడ్యూల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు తొలి దశ షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశారు. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొత్తం 20 మ్యాచ్ల తేదీలు అలాగే వేదికలను తాజాగా ప్రకటించింది ఐపీఎల్ యాజమాన్యం. ఈ మొదటి దశ షెడ్యూల్లో టోర్నమెంట్ ఆడే 10 జట్లు, తలో నాలుగు మ్యాచ్ లు ఆడబోతున్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వెలువరిస్తామని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. త్వరలోనే కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన షెడ్యూల్ను రెండు విభాగాలుగా ఫైనల్ చేశారు. ఇక ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇబ్బంది లేని వేదికలలో మిగిలిన రెండో దశ ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన హోం మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియం వేదికగానే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఎడిషన్ షెడ్యూల్ లో చెన్నై, హైదరాబాద్ తో ఆడే రెండు మ్యాచ్లు చిన్నస్వామి లో ఆడనుంది బెంగళూరు. ఇక ముంబై అలాగే రాజస్థాన్ తో ఆడే మ్యాచ్ ల‌ను మాత్రం ఇతర వేదికల్లో ఆడుతుంది.

 

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×