E-Paper
Advertisement

IPL 2026: కాటేర‌మ్మ కొడుకుల‌తో RCB తొలి మ్యాచ్ ఎందుకురా ? దీని వెనుక ఇంత కుట్ర ఉందా ?

IPL 2026: కాటేర‌మ్మ కొడుకుల‌తో RCB తొలి మ్యాచ్ ఎందుకురా ? దీని వెనుక ఇంత కుట్ర ఉందా ?
Advertisement

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఐపిఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన తొలిదశ షెడ్యూలు మాత్రమే విడుదల చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎండాకాలం మొత్తం ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ఇంకా రాలేదు. అయితే ఎన్నికల షెడ్యూల్ రాకపోయిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మొదటి దశ ఐపిఎల్ 2026 షెడ్యూల్ ను ఫైనల్ చేసింది బీసీసీఐ. ఈ మేరకు తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మొదటి దశ కొనసాగ నుంది. ఈ మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి.

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ ఇదే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన తొలిదశ షెడ్యూల్ రెండు రోజుల కిందట రిలీజ్ అయింది. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొదటి దశ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతుంది. అంటే ఈ తొలి దశలో మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కో జట్టుకు నాలుగేసి చొప్పున ఈ మొదటి దశలో మ్యాచులు ఉంటాయి. ఇక ఈ టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. మార్చి 28వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఎందుకంటే

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అనూహ్యంగా బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఐపీఎల్ అంటేనే డబ్బులు రాబట్టడం. జనాలను ఆకర్షించడం. దానికి తగ్గట్టుగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటేనే 300 పరుగులు చేస్తారని ఒక అంచనా ఉంటుంది. అందులో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి అరివీర భయంకరమైన కాటేరమ్మ కొడుకులు ఉన్నారు. వీళ్లు బరిలోకి దిగారంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది. బౌలర్లను ఊచ కోత కోస్తారు. గతంలో కూడా బెంగళూరు పైన అత్యధిక పరుగులు హైదరాబాద్ జట్టు సాధించింది. ఇలా మ్యాచులు ఉంటే కచ్చితంగా జనాలు చూసేందుకు వస్తారు. హైదరాబాద్ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ అత్యంత భయంకరమైన జట్టుగా మారింది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందులోను విరాట్ కోహ్లీ ఆడతాడు కాబట్టి జనాలు విపరీతంగా చూస్తారు. అందుకే ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో మొదటి దశ తొలి మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య పెట్టారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితేనే జనాలు వస్తారని అంచనా తో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×