E-Paper
Advertisement

SRH : 300 కాదు, ఈ సారి 400 లోడింగ్..బ్యాటింగ్ లో SRHను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే, కానీ అదొక్క‌టే మైన‌స్‌

SRH : 300 కాదు, ఈ సారి 400 లోడింగ్..బ్యాటింగ్ లో SRHను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే, కానీ అదొక్క‌టే మైన‌స్‌
Advertisement

SRH :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో 7 రోజుల్లోనే అంటే వారం రోజుల్లో ప్రారంభం కానంది. మార్చి 28వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఐపిఎల్ 2026 టోర్నమెంటులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఆడుతుంది? జట్టుకు ఉన్న ప్లస్, మైనస్ పాయింట్లు ఇప్పుడు పరిశీలిద్దాం.

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

SRH జట్టుకు బ్యాటింగే 1000 ఏనుగుల బలం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటేనే అందరికీ మన బ్యాటింగ్ లైనప్ మాత్రమే గుర్తుకువస్తుంది. దాదాపు మూడు సంవత్సరాలుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో ఇరగదీస్తోంది. దీనంతటికీ కారణం అభిషేక్ శర్మ, ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్, కాటేరమ్మ కొడుకు క్లాసెన్. ఇక గత సంవత్సరం నుంచి ఇషాన్ కిషన్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తోడయ్యాడు. మిడిల్ ఆర్డర్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇరగదీస్తాడు. ఈసారి కొత్తగా లివింగ్ స్టోన్ అరి వీర భయంకరమైన బ్యాటింగ్ తో రంగంలోకి దిగబోతున్నాడు. అలాగే దేశవాలి క్రికెటర్ అనికేత్ వర్మ ద బెస్ట్ ఫినిషర్ గా హైదరాబాద్ జట్టును ఆదుకుంటాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ లో అదరగొడతాడు. గత సీజన్లో కూడా వీళ్ళందరూ రాణించారు. ఇక ఈ సీజన్ లో టాప్ ఆర్డర్ మొత్తం మంచి ఫామ్ లో ఉంది. ఈసారి ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 300 కాదు 400 స్కోర్ కొట్టగలదని అంచనా వేస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మొన్నటి వరకు టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో కూడా ఇరగదీశారు. వీళ్ళ ఇద్దరి ఫామ్ హైదరాబాద్ జట్టుకు బాగా కలిసి రానుంది. బ్యాటింగ్ లో హైదరాబాద్ జట్టుకు ఎలాంటి సమస్య లేదని చెప్పవచ్చు.

హైదరాబాద్ జట్టుకు మైనస్ పాయింట్ ఇదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మైనస్ పాయింట్ బౌలింగ్ కానుంది. భువనేశ్వర్ జట్టులో నుంచి వెళ్లిపోయిన తర్వాత, సరిగ్గా ఎవరు బౌలింగ్ చేయడం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ తొలి దశ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. ఇది పెద్ద దెబ్బ అవుతుంది. అతడు బౌలింగ్ చేయకపోతే హైదరాబాద్ గెలవడం కష్టమే అంటున్నారు. అయినప్పటికీ హర్షల్ పటేల్, జయదేవ్, జీసన్ అన్సారి, శివం మావి, సలీం అరోరా లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కమిన్స్ ఉంటే మాత్రం హైదరాబాద్ బౌలింగ్ లో బలంగా ఉండేది. ఇక లేటెస్ట్ గా జాక్ ఎడ్వర్డ్స్ కూడా టోర్నమెంట్ నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో హర్షల్ పటేల్, జయదేవ్ ఇద్దరు బౌలింగ్ అదరగొడితే హైదరాబాద్ ను ఆపడం ఎవరి తరం కాదు. మరి మనవాళ్లు ఏం చేస్తారో చూడాలి.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×