E-Paper
Advertisement

IPL 2026: జ‌డేజా 14 కోట్లు, సంజుకు 18 కోట్లు..ష‌మీకి SRH షాక్‌..ట్రేడ్ ప్లేయ‌ర్ల లిస్ట్ ఇదే

IPL 2026: జ‌డేజా 14 కోట్లు, సంజుకు 18 కోట్లు..ష‌మీకి SRH షాక్‌..ట్రేడ్ ప్లేయ‌ర్ల లిస్ట్ ఇదే
Advertisement

IPL 2026:   ఐపీఎల్ 2026కు ( IPL 2026) సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఇవాళ రిటెన్షన్ కు చివరి తేదీ కావడంతో, రిటైన్ చేసుకునే ప్లేయర్లు అలాగే వదిలేసే ప్లేయర్ల లిస్టును సిద్ధం చేసుకుంటున్నాయి 10 ఫ్రాంచైజీలు. ముఖ్యంగా ట్రేడ్ ప్రక్రియ ద్వారా కొంతమంది ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో ఒక భాగంగానే ముఖ్యంగా సంజు శాంస‌న్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

జడేజాకు 14 కోట్లు, సంజుకు 18 కోట్లు

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రవీంద్ర జడేజాకు 14 కోట్లు పెట్టి, ట్రేడ్ ప్రక్రియ ద్వారా రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. చెన్నై రూ.18 కోట్లు ఇచ్చేంది. కానీ ఇప్పుడు రూ.14 కోట్ల‌కు జ‌డ్డూ స‌రిపెట్టుకున్నారు. సంజుకు 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. భవిష్యత్తులో మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సంజు లాంటి కీలక ప్లేయర్లు కావాలని ప్లాన్ చేస్తోంది చెన్నై. అలాగే జట్టుకు కెప్టెన్ గా కూడా రాణించగల మెటీరియల్ సంజు. అందుకే రూ.18 కోట్లు పెట్టి ట్రేడ్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక అటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్పిన్ సమస్య ఉంది. అందుకే రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ ను కొనుగోలు చేశారు. దీంతో ఈ ట్రేడ్ ప్రక్రియ విజయవంతమైంది.

మహమ్మద్ షమీని వదిలేసిన SRH

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రేడ్ ప్రక్రియ ద్వారా మహమ్మద్ షమీని వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో రూ.10 కోట్లకు లక్నో అతన్ని కొనుగోలు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రంజి ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో మహమ్మద్ షమీని కొనుగోలు చేసేందుకు లక్నో ముందుకు వచ్చింది.అలాగే కేకేఆర్ జట్టుకు సంబంధించిన మార్కండేయను స్పిన్నర్ గా వినియోగించుకునేందుకు ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసింది. రూ.30 లక్షలకు అతన్ని కేకేఆర్ నుంచి కొనుగోలు చేసింది.

Advertisement

అర్జున్‌ టెండూల్కర్ ను లక్నో 30 లక్షలకు ట్రేడ్ ద్వారా తీసుకుంది. నితీష్ రానాను రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 4.2 కోట్లు పెట్టి ఉన్ని తీసి రానా లాంటి డేంజర్ ఆట‌గాడిని తెలివిగా కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫెర్రెరిరాను కోటి రూపాయలు పెట్టి, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ ద్వారా తీసుకుంది. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ ను లక్నో జట్టు నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.రూథర్ ఫర్డ్ గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. సామ్ కరణ్ ను కూడా ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×