E-Paper
Advertisement

Inzamam-ul-Haq: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వ‌చ్చినా, PSLలోకి తీసుకోం..బ‌య‌ట‌కు పంపిస్తాం!

Inzamam-ul-Haq: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వ‌చ్చినా, PSLలోకి తీసుకోం..బ‌య‌ట‌కు పంపిస్తాం!
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియా ( India) అలాగే బంగ్లాదేశ్ ( Bangla desh ) మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ ( Indian Premier League 2026 tournament ) ఆడ‌కుండా ముస్తాఫిజుర్ రహమాన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ కు ( Mustafizur Rahman ) సపోర్టుగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చాలామంది విదేశీ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. మొయిన్ అలీ ( Moin Ali) లాంటి దుర్మార్గులు కూడా రెచ్చిపోయి, కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీలు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. తాజాగా ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) కూడా ఈ అంశంపై స్పందించాడు. ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పించడం చాలా దారుణమని ఫైరయ్యారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు. అలాగే రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ ( Virat Kohli) లాంటివాళ్ళు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడుతామంటే తాము అస్సలు ఒప్పుకోమని.. ఇండియన్స్ కు తమ టోర్నమెంటులో ఛాన్స్ లేదని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

కోహ్లీ, రోహిత్ శ‌ర్మ వ‌చ్చినా, PSLలోకి తీసుకోం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను తొలగించిన నుంచి పాకిస్తాన్ రెచ్చిపోతోoది. అక్కడి మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేవాళ్లు ఓవర్ గా బిహేవ్ చేస్తూ, బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ కంటే తమ టోర్నీ గొప్పది అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అవకాశం రానివాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడవచ్చు అని కోరుతున్నారు.

అంతర్జాతీయంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును బ్లెం చేసేందుకు కుట్రలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్తాఫిజుర్ రహమాన్ పై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ గొప్పది అంటూ చెప్పుకొచ్చారు. ఇండియాకు చెందిన ఏ ఒక్క ప్లేయర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఆడడానికి వీలులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద తోపు ప్లేయర్ వచ్చినా ఆడించుకోమని పేర్కొన్నారు.

ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) కామెంట్లపై ట్రోలింగ్

Advertisement

రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు వచ్చినా కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఆడించుకోబోమని ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు జీతాలు కలిపితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను కొనేయవచ్చు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. చిన్నపిల్లల డైపర్ల ఖర్చు అంతా కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ బడ్జెట్ ఉండబోదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటి టోర్నమెంట్లకు ఇండియన్స్ ఎవరు రారని కౌంటర్ ఇస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×