E-Paper
Advertisement

Inzamam-ul-Haq: ఇంత అవ‌మానం జ‌రిగినా సిగ్గురాలేదా ? వెంట‌నే ఐపీఎల్ ను ఆస్ట్రేలియ‌న్స్ బ్యాన్ చేయండి !

Inzamam-ul-Haq: ఇంత అవ‌మానం జ‌రిగినా సిగ్గురాలేదా ? వెంట‌నే ఐపీఎల్ ను ఆస్ట్రేలియ‌న్స్ బ్యాన్ చేయండి !
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ వర్సెస్ ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ వివాదం (Travis Head Vs Virat Kohli Handshake Controversy) తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా మొన్న 22వ తేదీన రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలాగే ట్రావిస్ హెడ్ మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఆ చిన్న గొడవ చినికి చినికి గాలి వాన అయింది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

Advertisement

ఈ క్రమంలో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా, విరాట్ కోహ్లీ అగ్రేసివ్ గా వ్యవహరించి వెళ్లిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కోహ్లీది తప్పు అని కొంతమంది అంటుంటే, హెడ్ కూడా తప్పు చేసి ఉంటాడని హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) కూడా ఈ అంశంపై స్పందించారు. ఇంత అవమానం జరిగినా సిగ్గు రాలేదా ? వెంటనే ఐపీఎల్ టోర్నమెంట్ ను ఆస్ట్రేలియా ప్లేయర్లు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

ఐపీఎల్ ను ఆస్ట్రేలియ‌న్స్ బ్యాన్ చేయండి – ఇంజమామ్

హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా హెడ్ ను విరాట్ కోహ్లీ అవమానించిన తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కం కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపైన హెడ్ లాంటి డేంజర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ కు అవమానం జరిగింది… ఇంత జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించడం లేదని మండిపడ్డారు. అయినప్పటికీ సిగ్గు లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడుతున్నారని ఆగ్రహించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో విదేశీ క్రికెటర్లకు ఏ మాత్రం సేఫ్టీ ఉండబోదని వ్యాఖ్యానించారు ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ).

Advertisement

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా తప్పు మొత్తం విరాట్ కోహ్లీదేనని పేర్కొన్న ఇంజమాం… హెడ్ అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లినా కూడా… బీసీసీఐ తన వెనకాల ఉందని బలుపు చూపించాడని విరాట్ కోహ్లీ పై సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా చీమకుట్టినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. ఇకనైనా విదేశీ క్రికెటర్లు అందరూ ఐపీఎల్ కాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే మంచి భవిష్యత్తు విదేశీ క్రికెటర్లకు ఉంటుందని వ్యాఖ్యానించారు ఇంజమామ్ వుల్ హక్.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×