E-Paper
Advertisement

Inzamam-ul-Haq: అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్..వెంట‌నే ఐసీసీ ద‌ర్యాప్తు చేయాలి

Inzamam-ul-Haq: అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్..వెంట‌నే ఐసీసీ ద‌ర్యాప్తు చేయాలి
Advertisement

Inzamam-ul-Haq:  న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడవ టీ20లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఇరగదీసిన సంగతి తెలిసిందే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియాను 10 ఓవర్లలోనే గెలిపించేశాడు అభిషేక్ శర్మ. ఈ తరుణంలోనే 14 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు అభిషేక్. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాట్ ను న్యూజిలాండ్ క్రికెటర్లు చెక్ చేసిన సంగతి తెలిసిందే. అసలు బ్యాట్ లో ఏముంది ? ఇంత భయంకరంగా ఆడుతున్నాం అంటూ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అభిషేక్ శర్మను ఆరా తీశారు న్యూజిలాండ్ క్రికెటర్లు. ఈ సంఘటన వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటలో ఏదో ఉందని.. కచ్చితంగా ఐసీసీ దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్ లు.. ఇంజమామ్ వుల్ హక్ సంచలనం

Advertisement

న్యూజిలాండ్ పై అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మను అవమానిస్తూ ఇంజమామ్ వుల్ హక్ సంచలన ఆరోపణలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై అనేక అనుమానాలు ఉన్నట్లు బాంబు పేల్చాడు. అభిషేక్ శర్మ వాడుతున్న బ్యాట్ లో చిప్ లు ఉన్నాయని పేర్కొన్నాడు. వెంటనే దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశాడు. లేకపోతే న్యూజిలాండ్ లాంటి భయంకరమైన బౌలర్లను ఇలా చితక బాదడం ఏంటి ? భయంకరమైన సిక్సర్లు కొట్టడం ఏంటి ? ఏమాత్రం నమ్మశక్యం గా లేదంటూ విమర్శలు చేశాడు ఇంజమామ్ వుల్ హక్. కచ్చితంగా దీనిపై ఐసీసీ దర్యాప్తు చేయాలని.. లేకపోతే టి20 ప్రపంచ కప్ లో అభిషేక్ శర్మ మరింత భయంకరంగా ఆడతాడని హెచ్చరించాడు ఇంజమామ్ వుల్ హక్. ఇక ఇంజమామ్ వుల్ హక్ ఇలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. బ్యాట్ లో ఎలాంటి చిప్ లు లేవని… పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇలాగే బురద చల్లుతారని ఫైర్ అవుతున్నారు. గ‌తంలో కూడా ఇలాగే అభిషేక్ శ‌ర్మ బ్యాట్ లో చిప్ లు ఉన్నాయ‌ని ఇంజమామ్ వుల్ హక్ ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్‌.

యువ‌రాజ్ స‌ర‌స‌న చేరిన‌ అభిషేక్ శర్మ

టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 14 బంతుల్లోనే అర్థ సెంచ‌రీ చేశాడు. దీంతో టీమిండియా త‌ర‌ఫున ఫాస్టెస్ట్ అర్ధ‌సెంచ‌రీ చేసిన రెండో ప్లేయ‌ర్ గా రికార్డులోకి ఎక్కాడు. అభిషేక్ కంటే ముందు యువ‌రాజ్ సింగ్ ముందుగా ఉన్నాడు. 12 బంతుల‌లోనే యూవీ 50 ప‌రుగులు చేశాడు.

Advertisement

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×