E-Paper
Advertisement

INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య ఐదో టీ20.. చివ‌రి మ్యాచ్ లో గెలిచేది ఎవ‌రో..?

INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య ఐదో టీ20.. చివ‌రి మ్యాచ్ లో గెలిచేది ఎవ‌రో..?
Advertisement

INDW Vs SLW : భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక ఉమెన్స్ మ‌ధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే జ‌రిగిన‌టువంటి నాలుగు మ్యాచ్ ల్లో కూడా భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో సిరీస్ ను కూడా టీమిండియా కైవ‌సం చేసుకుంది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. గ‌త నాలుగు మ్యాచ్ ల్లో కూడా భార‌త మ‌హిళ‌లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్ట‌ణంలో రెండు మ్యాచ్ లు, తిరువ‌నంత‌పురంలో రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. ఇక ఐదో టీ 20 కూడా తిరువ‌నంత‌పురం వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రుగ‌నుంది.

Also Read : Hugh Morris Death : ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత

ఆ ఒక్క‌టి గెలిచేనా..?

Advertisement

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ 4-0తో సీరిస్ ను కైవ‌సం చేసుకున్న హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని టీమిండియా.. అదే జోరు కొన‌సాగిస్తూ ఐదో మ్యాచ్ లో కూడ గెలిచి క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ఎలాగైనా చివ‌రి మ్యాచ్ అయినా గెలిచి క్లీన్ స్వీప్ కాకుండా చూడాల‌ని శ్రీలంక కోరుకుంటుంది. గ‌త నాలుగు మ్యాచ్ ల్లో కూడా భార‌త్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ ముందు శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టు స్వ‌ల్ప స్కోర్ కే ప‌రిమిత‌మైంది. అయితే నాలుగో మ్యాచ్ లో మాత్రం టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. గ‌త మూడు మ్యాచ్ ల్లో విఫ‌లం చెందిన స్మృతి మంధాన నాలుగో టీ 20లో విరుచుకుప‌డింది. 48 బంతుల్లో 80 ప‌రుగులు చేసింది. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకుంది.

మ్యాచ్ ని ఎక్క‌డ చూడాలంటే..?

అలాగే మ‌రో ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ కూడా 46 బంతుల్లో 79 ప‌రుగులు సాధించింది. అయితే శ్రీలంక జ‌ట్టు 222 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. అయితే శ్రీలంక చివ‌రి వ‌ర‌కు పోరాడి ఓట‌మి పాలైంది. 30 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. గ‌త మ్యాచ్ ల‌తో పోల్చితే నాలుగో మ్యాచ్ లో శ్రీలంక జ‌ట్టు బ్యాటింగ్ విధానం అద్భుత‌మ‌నే చెప్పాలి. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగులు చేసింది ఆ జ‌ట్టు. చివ‌రి పోరులోనూ విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేయాల‌ని భావిస్తోంది. షెఫాలి, స్మృతి మంధాన‌, జెమీమా, రిచా మంచి ఫామ్ లో ఉండ‌టంతో భార‌త జ‌ట్టును అడ్డుకోవ‌డం శ్రీలంక‌కు స‌వాలే. ఇక ఇవాళ జ‌రిగే చివ‌రి మ్యాచ్ అయినా గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తోంది శ్రీలంక జ‌ట్టు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంట‌ల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు.

Advertisement

Also Read : BBL15 : బిగ్ బాష్ లీగ్ లో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. వీడియో వైర‌ల్..!

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×