// // INDW vs SLW 1st T20I: వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం -->
E-Paper
Advertisement

INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ లో స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ లో స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం
Advertisement

INDW vs SLW 1st T20I:  టీమిండియా మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మొన్నటి వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో అదరగొట్టిన టీమిండియా, తాజాగా మరో టి20 మ్యాచ్ గెలిచింది. శ్రీలంక వర్సెస్ టీమిండియా మహిళల జట్ల మధ్య వైజాగ్ వేదికగా టి20 సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం ఐదు టి20 లు జరగనున్నాయి. తొలి టి20 మ్యాచ్ వైజాగ్ వేదికగా ఇవాళ జరగగా, ఇందులో ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. శ్రీలంక విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు నష్టపోయి 14.4 ఓవర్లలో చేదించింది టీమిండియా మహిళల జట్టు. చివరి వరకు ఉండి విజయతీరాలకు జట్టును చేర్చిన జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజ‌యంతో 5 టీ20ల సిరీస్ లో 1-0 తేడాతో టీమిండియా లీడ్ సాధించింది.

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

8 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Advertisement

టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఇవాళ ఐదు టీ20 ల సిరీస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభం మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు నష్టపోయి 121 పరుగులు సాధించింది. శ్రీలంక జట్టులో ఓపెనర్ గా వచ్చిన విషామి గుణరత్నే 43 బంతుల్లో 39 పరుగులు చేయగా హాసినీ పెరేరా 20 పరుగులతో రాణించారు. అటు హర్షిత మాధవి 21 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. శ్రీలంక కెప్టెన్ చామరి ఆట‌ప‌ట్టు దారుణంగా విఫలమై కేవలం 15 పరుగులు మాత్రమే చేసింది. ఇక శ్రీలంక విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు అవలీలగా ఛేదించింది.

14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి 122 పరుగులు చేసి మొదటి టీ20 లో విజయం సాధించింది టీమిండియా మహిళల జట్టు. ఈ సందర్భంగా జెమిమా రోడ్రిగ్స్ 44 బంతుల్లో 69 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఆమె నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. అటు ఇటీవల పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మందాన 25 బంతుల్లో 25 పరుగులకు ఔట్ అయింది. దీంతో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లి రద్దయిన బాధలో ఉన్న స్మృతి మందాన, చిన్న లక్ష్యం ఉన్నప్పుడు కూడా టీమిండి అని గెలిపించలేకపోయిందని విమర్శలు చేస్తున్నారు. కాగా టీ20 ల‌లో 4 వేల ప‌రుగులు చేసిన టీమిండియా తొలి బ్యాట‌ర్ గా స్మృతి చ‌రిత్ర సృష్టించింది. అటు ఈ లిస్ట్ లో మొద‌టి స్థానంలో సుజీ ఉన్నారు.

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య షెడ్యూల్

Advertisement

టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఈ ఐదు టి20 సిరీస్ షెడ్యూల్ ఇప్పటికే ఫైనల్ అయింది. ఇవాళ విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరగగా, డిసెంబర్ 23వ తేదీన రెండవ టి20 ఇదే విశాఖపట్నంలో జరగనుంది. డిసెంబర్ 26వ తేదీన తిరువనంతపురం లోని గ్రీన్ ల్యాండ్ లో మూడవ టి20 నిర్వహిస్తారు. 4వ టి20 మ్యాచ్ డిసెంబర్ 28వ తేదీన , ఐదవ టి20 డిసెంబర్ 30వ తేదీన ఇదే తిరువనంతపురం లోనే జరగనుంది.

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×