E-Paper
Advertisement

Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్స్.. ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్స్.. ఎంత ఖర్చు చేశారో తెలుసా ?
Advertisement

Vande Bharat Train:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఇలా ప్రత్యేకంగా ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను ఢిల్లీకి తరలించారు. వాస్తవంగా మే 8వ తేదీ అంటే గురువారం రోజున హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Also Read: SRH vs KKR Tickets : BCCI కీలక ప్రకటన..ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్

Advertisement

అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్

ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసి పది ఓవర్లు వాడింది. అప్పటికే 122 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. అయితే అదే సమయంలో పాకిస్తాన్… జమ్మూ కాశ్మీర్ పై దాడులకు పాల్పడింది. వాటిని ఇండియన్ ఆర్మీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని.. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెంటనే అలెర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. ధర్మశాల వేదికగా జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను రద్దు చేసింది.

Advertisement

సాంకేతిక సమస్య అంటూ మొదట ఫ్లడ్ లైట్స్ ఆపేసింది ఐపీఎల్ యాజమాన్యం. పెద్ద సైరన్ ఇచ్చి.. మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ధర్మశాల స్టేడియంలో ఉన్న అభిమానులందరికీ మెల్లిగా బయటకు పంపించింది. ఆ తర్వాత మ్యాచ్ రద్దు అని ఈ ప్రకటించింది. అయితే ధర్మశాల లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను… చాలా సేఫ్ గా ఢిల్లీకి తీసుకువచ్చింది ఇండియన్ ఆర్మీ. దీనికోసం ప్రత్యేకంగా వందే భారత్ ట్రైన్ ను వాడుకుంది.

ధర్మశాల నుంచి ఢిల్లీకి ప్రత్యేక వందే భారత్

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ధర్మశాల నుంచి వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్లను ఢిల్లీకి తరలించింది ఇండియన్ ఆర్మీ. ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను.. ఈ ట్రైన్ లో తరలించింది. వాస్తవానికి ధర్మశాలకు వందే భారత్ ఆప్షన్ లేదు. అయినప్పటికీ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా వందే భారత్ ట్రైన్ తీసుకువచ్చారు. అలాగే ఈ ట్రైన్ కు ఎదురుగా ఏ ట్రైన్ కూడా రాకుండా ముందుగానే చూసుకున్నారు రైల్వే అధికారులు. అలా ఢిల్లీకి ఈ ప్లేయర్లను తరలించారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ ట్రైన్ లో ప్లేయర్లు ప్రయాణించిన.. ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలా తరలించడానికి దాదాపు 10 లక్షల వరకు ఇండియన్ ఆర్మీ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

Also Read: RCB Struggles: RCBని వెంటాడుతున్న దరిద్రం.. 100 టోర్నమెంట్లు వచ్చినా మీకు కప్పు రాదు

?igsh=MTZzNHE2Nmx4emtvdg%3D%3D

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×