E-Paper
Advertisement

India Vs West Indies : సూర్య విధ్వంసం.. తిలక్ మెరుపులు .. భారత్ విక్టరీ..

India Vs West Indies : సూర్య విధ్వంసం.. తిలక్ మెరుపులు .. భారత్ విక్టరీ..
Advertisement

India Vs West Indies : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ సత్తాచాటింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులో బ్రెండన్ కింగ్ (42), కెప్టెన్ పావెల్ (40 నాటౌట్ ) మెరుపులు మెరిపించారు. మేయర్ (25), పూరన్ (20) పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ , ముఖేశ్ కుమార్ తలో వికెట్ తీశారు.

160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్ నాలుగో బంతికే అరంగేట్రం ఆటగాడు యశస్వి జైశ్వాల్ (1) వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ తొలి రెండు బంతులకు ఫోర్ , సిక్సు కొట్టి తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. సూర్య దూకుడుగా ఆడుతున్నా.. మరోవైపు క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడి గిల్ (6) అవుట్ అయ్యాడు. అప్పటి నుంచే గేమ్ స్వరూపం మారిపోయింది. సూర్యకు జతకలిసిన తిలక్ వర్మ (49 నాటౌట్, 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు) దూకుడుగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. తానాడిన తొలి రెండు బంతులను బౌండరీకి పంపాడు. ఈ జోడి మూడో వికెట్ కు 87 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేసింది.

Advertisement

సూర్య (83, 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20 నాటౌట్ ) సిక్సుతో భారత్ కు విజయాన్ని అందించాడు. టీమిండియా 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు, మెకాయ్ ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్ లో అదరగొట్టిన సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగో టీ20 మ్యాచ్ ఆగస్టు 12న జరుగుతుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×