E-Paper
Advertisement

IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా
Advertisement

IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా శివరాత్రి రోజున దాయాదుల మధ్య పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మ్యాచ్ అనగానే అందరూ అలర్ట్ అయి మ్యాచ్ చూసారు. కానీ ఇండియాను ఓడించే అంత కసి పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. టీమిండియా బౌలర్ల దెబ్బకు కకా వికలమైంది పాకిస్తాన్ జట్టు. ఏమాత్రం అసలు పోటీనే ఇవ్వలేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నమీబియా లాంటి జట్లు ఇండియాకు టఫ్ ఫైట్ ఇచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రేమ దాస స్టేడియంలో ( R.Premadasa Stadium, Colombo) చెత్త ప్రదర్శన కనబరిచి, ఇండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఇండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫ‌ల‌మైంది పాకిస్తాన్.  ఈ మ్యాచ్ లో 176 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 18 ఓవ‌ర్లు ఆడింది పాకిస్తాన్‌. దీంతో 114 ప‌రుగుల వ‌ద్ద కుప్ప‌కూలింది. దీంతో 61 ప‌రుగుల తేడాతో ఓడింది పాకిస్తాన్‌. ఈ దెబ్బ‌కు సూప‌ర్ 8లోకి టీమిండియా దూసుకెళ్లింది.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

టీమిండియా ఆదుకున్న ఇషాన్ కిష‌న్‌…పాకిస్తాన్ దారుణ ఓట‌మి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ప్రేమ దాస స్టేడియం వేదిక‌గా జ‌రిగిన పాక్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్ లో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ ఇర‌గ‌దీశాడు. స్పిన్న‌ర్ల‌కు బంతి బాగా అనుకూలించినా, పాక్ బౌల‌ర్లు అగ్ని పిడుగుల్లాంటి బంతులు వేసినా ఇషాన్ కిష‌న్ బెద‌ర‌లేదు. ఈ త‌రుణంలోనే సెంచ‌రీ మిస్ చేసుకున్న ఇషాన్ కిష‌న్‌, 40 బంతుల్లో 77 ప‌రుగులు సాధించాడు. ఇందులో 3 సిక్స‌ర్లు ఉండ‌గా, 10 బౌండ‌రీలు ఉన్నాయి. 192 స్ట్రైక్ రేట్ తో ఆక‌ట్టుకున్నాడు. అటు సూర్య కుమార్ యాద‌వ్ 32 ప‌రుగులు సాధించాడు. అటు తిల‌క్ వ‌ర్మ 25 ప‌రుగులతో రాణించాడు. చివ‌ర‌లో శివం దూబే 27 ప‌రుగులు సాధించ‌గా చివ‌ర‌లో రింకు సింగ్ 11 ప‌రుగులు చేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా, 7 వికెట్లు న‌ష్ట‌పోయింది. ఈ త‌రుణంలోనే 175 ప‌రుగులు చేసింది ఇండియా. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో విఫ‌ల‌మైంది పాకిస్తాన్‌. దీంతో ఓడిపోయింది. 176 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 18 ఓవ‌ర్లు ఆడింది పాకిస్తాన్‌. దీంతో 114 ప‌రుగుల వ‌ద్ద కుప్ప‌కూలింది.

సూప‌ర్ 8లోకి టీమిండియా

కొలంబో వేదికగా అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా కు అదిరిపోయే న్యూస్ అందింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో గ్రూప్ ఏ లో ఉన్న టీమిండియా సూపర్ 8 లోకి అధికారికంగా దూసుకు వెళ్ళింది. వరుసగా మూడు విజయాలు గ్రూప్ స్టేజిలో నమోదు చేసుకున్న టీమిండియా కు మొత్తం ఆరు పాయింట్లు దక్కాయి. ఈ నేపథ్యంలోనే అధికారికంగా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మరో జట్టు ఈ గ్రూప్ నుంచి సూపర్ 8 లోకి రావాల్సి ఉంటుంది. దీనికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే పాకిస్తాన్ తలపడనున్నాయి.

Advertisement

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×