E-Paper
Advertisement

IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ
Advertisement

IND VS SA 1st ODI:  దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో ఎట్టకేలకు టీమిండియా బోణీ కొట్టింది. టీమిండియా బ్యాటర్లు అదే సమయంలో బౌలర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సేన‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఛేజింగ్ చేసే క్ర‌మంలో మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ ఇద్ద‌రూ… టీమిండియా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. కానీ చివ‌ర‌కు టీమిండియానే విజ‌యం సాధించింది. 350 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 49.2 ఓవ‌ర్లు ఆడిన ద‌క్షిణాఫ్రికా, 332 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. దీంతో ఈ మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా పై ఏకంగా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది టీమిండియా.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదిరిపోయే బ్యాటింగ్

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కేఎల్ రాహుల్ టాస్ ఓడిపోయాడు. అటు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా, టీమిండియా కు బ్యాటింగ్ ఇచ్చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా రోహిత్ శర్మ అర్థ సెంచరీ తో రెచ్చిపోయాడు. ఈ తొలి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. కింగ్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో రెచ్చిపోయాడు. అటు కే ఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా 32 పరుగులతో రఫ్పాడించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన టీమిండియా, 349 పరుగులు సాధించింది. అయితే ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో దక్షిణాఫ్రికా, ముందు త‌డ‌బ‌డింది. ఆ త‌ర్వాత రెచ్చిపోయింది. దీంతో టీమిండియా ఓడిపోవ‌డం గ్యారెంటీ అనుకున్నారు. కానీ చివ‌ర‌కు టీమిండియా విజ‌యం సాధించింది.

ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మార్కో జాన్సెన్ ర‌ఫాడించాడు. ఈ మ్యాచ్ లో 100 ప‌రుగ‌ల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ఉన్న ద‌క్షిణాఫ్రికాను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ త‌రుణంలోనే 39 బంతుల్లో 72 ప‌రుగులు సాధించాడు మార్కో జాన్సెన్. ఇందులో 3 సిక్స‌ర్లు, 8 బౌండ‌రీలు ఉన్నాయి. దాదాపు 180 స్ట్రైక్ రేట్ తో టీమిండియా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు మార్కో జాన్సెన్. కానీ చివ‌ర‌కు కుల్దీప్ యాద‌వ్ వేసిన మ్యాజిక్ స్పిన్ కు మార్కో జాన్సెన్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కార్బిన్ బాష్ కూడా చివ‌ర‌లో 51 బంతుల్లో 67 ప‌రుగులు సాధించాడు. ఇందులో 4 సిక్స‌ర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. చివ‌ర‌లో వ‌చ్చిన కార్బిన్ బాష్, ద‌క్షిణాఫ్రికాను గెలిపిస్తాడ‌ని అనుకున్నారు. కానీ ఒత్తిడి పెర‌గ‌డంతో వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. కాగా డిసెంబ‌ర్ 3వ తేదీన రాయ్‌పూర్ వేదిక‌గా రెండో వ‌న్డే జ‌రుగ‌నుంది.

Advertisement

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×