E-Paper
Advertisement

INDW vs SLW 2nd T20I: నేడే శ్రీలంతో రెండో టీ20..తెర‌పైకి మ‌రో అందాల తార‌..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

INDW vs SLW 2nd T20I: నేడే శ్రీలంతో రెండో టీ20..తెర‌పైకి మ‌రో అందాల తార‌..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
Advertisement

INDW vs SLW 2nd T20I: టీమిండియా మహిళల జట్టు ఇవాళ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య టి20 సిరీస్ స్వదేశంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు టి20 సిరీస్ లో ఇప్పటికే టీమిండియా మహిళల జట్టు మొదటి మ్యాచ్ గెలిచింది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

నేడే శ్రీలంతో రెండో టీ20

Advertisement

టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక మహిళల ( India Women vs Sri Lanka Women, 2nd T20I) జట్ల మధ్య ఇవాళ సాయంత్రం రెండో టి20 జరగనుంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. మొదటి మ్యాచ్ ఇక్కడే జరిగింది. రెండవ టి20 కూడా ఇదే వేదికగా నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆరున్నర గంటలకు టాస్ వేస్తారు. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ లు ఉచితంగా చూడాలంటే జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తున్నాయి.

ఈ అందాల తార ఎవరంటే ?

పైన ఫోటోలో కనిపిస్తున్న అందాల తార టీమ్ ఇండియా ప్లేయర్. కొత్తగా మహిళల టీమిండియాలోకి వైష్ణవి శర్మ కొత్తగా వచ్చారు. కేవలం 20 సంవత్సరాలు ఉన్న వైష్ణవి శర్మ 2005, డిసెంబర్ 18వ తేదీన జన్మించారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ గా జట్టులోకి వచ్చిన వైష్ణవి శర్మ, శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొన్న జరిగిన టి20 తో అంతర్జాతీయ క్రికెట్ లోకి చేశారు. స్పిన్ బౌలింగ్ అద్భుతంగా వేయగలరు వైష్ణవి శర్మ. ఈమెది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. వైష్ణవి తండ్రి నరేంద్ర శర్మ కారణంగానే క్రికెట్లోకి వచ్చి రాణిస్తోంది. అండర్ 19 ప్రపంచకప్ లో కూడా వైష్ణవి శర్మ అదరగొట్టింది. ఈ టోర్నమెంట్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్ గా కూడా చరిత్ర సృష్టించింది. మొత్తంగా టోర్నమెంట్ లో 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచింది వైష్ణవి శర్మ. అందుకే ఆమెను అంతర్జాతీయ జట్టులోకి తీసుకున్నారు.

టీమిండియా వ‌ర్సెస్ శ్రీలంక జ‌ట్ల అంచ‌నా

Advertisement

టీమిండియా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), రిచా ఘోష్ (wk), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్ మరియు శ్రీ చరణి

శ్రీలంక : విష్మీ గుణరత్నే, చమరి అతపత్తు (కెప్టెన్‌), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నూత్యంగన (WK), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కవింది మరియు శశిని గిమ్హాని

 

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×