E-Paper
Advertisement

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్… ఎప్పుడంటే ?

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్… ఎప్పుడంటే ?
Advertisement

IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో… మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. అయితే ఇన్ని రోజులు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా పురుషుల జట్లు తలపడ్డాయి. ఇక ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. టీమిండియా మహిళల జట్టు వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్న‌మెంట్‌ వేదిక కానుంది.

Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి బిగ్ ఫైట్

Advertisement

మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తొలి మ్యాచ్ ఇవాళ ఆడనుంది టీం ఇండియా. ఇవాళ శ్రీలంకతో టీమిండియా మొదటి ఫైట్ ఉండనుంది. అయితే అదే సమయంలో పాకిస్తాన్ వర్సెస్ మహిళల టీమిండియా మధ్య కూడా పోరు జరగనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీన కొలంబో వేదికగా జరగనుంది. ఆ రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఫైట్ ఉంటుంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు పాకిస్తాన్ జట్టును పురుషుల టీమిండియా జట్టు చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమెన్స్ వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో కూడా రెండు జట్లు లీగ్ దశలో తలపడుతున్నాయి. ఒకవేళ ఈ రెండు జట్లు బాగా రాణించి… ముందుకు వెళితే.. ఈ టోర్న‌మెంట్ లో సెమీస్‌, ఫైనల్ ల‌లో మరోసారి కూడా త‌ల‌ప‌డ‌తాయి. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో కూడా గ్రూప్ స్టేజ్‌, సూప‌ర్ 4, ఫైన‌ల్స్ లో టీమిండియా పురుషుల జ‌ట్టు, పాకిస్థాన్ మ‌ధ్య ఫైట్ జ‌రిగింది.

మహిళల ప్రపంచ కప్ షెడ్యూల్ ఇదే

2025 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఇవాల్టి నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతుంది. ఇండియా అలాగే శ్రీలంక రెండు దేశాలు కూడా… ఈ టోర్నమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే శ్రీలంకలోనే నిర్వహించనున్నారు. రెండు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే
ఈ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక దేశాలు ఇందులో పాల్గొంటాయి. మొదట గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్స్ ఉంటాయి. ఇక మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ వన్డే ఫార్మాట్ లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్ ప్ర‌సారాల‌ను స్టార్ స్పోర్ట్స్ అలాగే జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు.

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×