E-Paper
Advertisement

Bangladesh : బంగ్లాదేశ్ పై భారత్ జయభేరి..ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో గెలుపు

Bangladesh : బంగ్లాదేశ్ పై భారత్ జయభేరి..ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో గెలుపు
Advertisement

Bangladesh : టీ20 వరల్డ్ కప్ లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమైన రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. కీలకపోరులో హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లీ తన భీకర ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి చెలరేగాడు. విరాట్ 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ కూడా 30 పరుగులతో మెరుపులు మెరిపించాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ లిట్టన్ దాస్ చెలరేగడంతో పవర్ ఫ్లేలో 6 ఓవర్లలోనే 66 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించడంతో బంగ్లాదేశ్ కు 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. వర్షం తర్వాత భారత్ బౌలర్లు చెలరేగారు. ప్రమాదకరంగా మారిన లిట్టన్ దాస్ 60 పరుగులు చేసి రనౌట్ కావడంతో రోహిత్ సేన మ్యాచ్ పై పట్టు సాధించింది. అయితే చివరిలో వికెట్ కీపర్ నురల్ హసన్ భారత్ ను భయపెట్టాడు. చివరి ఓవర్ ను అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ కు చేరువైంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×