E-Paper
Advertisement

India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ.. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ సూపర్ విక్టరీ.. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్
Advertisement

India vs Sri Lanka 3rd T20 2024: శ్రీలంక పర్యటనలో భారత్ జోరు కొనసాగుతోంది. 3 టీ20 సిరీస్ లో భాగంగా వరుసగా మూడో మ్యాచ్ లోనూ విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. మంగళవారం నరాలు తెగే ఉత్కంఠ పోరులో భారత్ అదరగొట్టింది. ఆఖరి టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపు అందుకుని సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసంది. శుభమన్ గిల్ 37 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులతో రాణించాడు.రియాన్ పరాగ్ 18 బందుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లతో 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 18 బందుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 25 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహీస్ తీక్షణ మూడు వికెట్లు, వానిందు హసరంగా 2 వికెట్లు పడగొట్టారు. విక్రమిసంఘే, అసితా ఫెర్నాండో, రమేష్ మెండీస్ తలో వికెట్ తీశారు.

Advertisement

భారత్ విధించిన 138 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక మొదట అద్భుతంగా ఆడారు. దాదాపు విజయం ఖాయమైపోయింది. ఆ తర్వాత బౌలర్ల ధాటికి ఒక్కొక్కరు పెవిలియన్ చేరారు. దీంతో శ్రీలకం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. చివరి ఓవర్ వేసిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ 41 బందుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు, కుశాల్ పెరీరా 34 బంతుల్లో 5 ఫోర్లతో 46, పాతుమ్ నిస్సంక 27 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.

శ్రీలంక..భారత్ స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. అయితే శ్రీలకం బ్యాటింగ్ చేపట్టగా.. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. రెండో బంతికి పెరీరా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన నిశాంక కూడా ఔట్ కావడంతో శ్రీలంక సూపర్ ఓవర్ ముగిసింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్..ఓపెనర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే బౌండరీ కొట్టి విజయాన్ని అందించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×