E-Paper
Advertisement

India vs New zealand:- ఉప్పల్ మ్యాచ్.. ఏవేవి తీసుకెళ్లొద్దంటే..

India vs New zealand:- ఉప్పల్ మ్యాచ్.. ఏవేవి తీసుకెళ్లొద్దంటే..
Advertisement

India vs New zealand:- భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి వన్డే కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు… పోలీసులు. ఏకంగా 2,500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. మైదానం బయట, వాహనాల పార్కింగ్‌, తనిఖీల ప్రాంతంలో మొత్తం 300 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు. నిఘా కోసం ప్రత్యేకంగా జాయింట్ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వేల మంది తరలివస్తారు కాబట్టి… ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులను సెల్ ఫోన్లు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. స్టేడియం లోపలికి ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టె, లైటర్‌, పదునైన సామగ్రి, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బైనాక్యులర్లు, నాణేలు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పర్ఫ్యూమ్‌లు, బ్యాగులు, బయటి తినుబండారాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. మొబైల్‌ ఫోన్లను కూడా తనిఖీ చేసేందుకు ప్రతి గేటు దగ్గర నలుగురు సాంకేతిక సిబ్బందిని నియమించారు. తాగే నీళ్లు, తినుబండారాలు స్టేడియం లోపలే అందుబాటులో ఉంటాయి కాబట్టి… వాటర్ బాటిళ్లను, బయటి ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పోలీసులు చెప్పారు. కాలినడకన వచ్చే అభిమానులు… స్టేడియంలోకి ఏ గేటు నుంచైనా వెళ్లవచ్చు. బైక్స్ మీద వచ్చే వాళ్లు పార్కింగ్ ఏరియా Bలో వాహనాలు పెట్టాలని, దివ్యాంగులు రామంతాపూర్‌ రోడ్డు మీదుగా మూడో నెంబరు గేటు నుంచి వచ్చి… వారి వాహనాలను పార్కింగ్ ఏరియా Bలో పెట్టాలని పోలీసులు సూచించారు. ఇక కార్ పాస్ ఉన్న వాళ్లు రామంతాపూర్‌ వైపు నుంచి వచ్చి పార్కింగ్ ఏరియాలు A,Bల్లో వాహనాలు నిలపాలని కోరారు.

Advertisement

మరోవైపు, మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడంపైనా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న 15 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 54 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×