E-Paper
Advertisement

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. ఇదే మన భారత జట్టు

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. ఇదే మన భారత జట్టు
Advertisement
India squad announced for Women’s T20 World Cup 2024: టీమ్ ఇండియా పురుషుల జట్టుకు ధీటుగా అమ్మాయిలు కూడా అదరగొడుతున్నారు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్ వరకు వెళ్లి, శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. అయితేనేం అద్భుతంగా ఆడి, అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఈసారి ఫైనల్ లో కూడా గెలిచి కప్ తో రావాలని అభిమానులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇందుకోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎప్పటిలా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా, స్మ్రతి మంధాన వైస్ కెప్టెన్ గానే ఉన్నారు.

ఇటీవల కొత్తగా ఎంపిక చేస్తున్న ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్ ఉన్నారు. టీ 20 మెన్ ప్రపంచకప్ సందర్భంగా ఇలాగే తొలిసారి ఎంపిక చేశారు. అందులో శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ తదితరులున్నారు. ఇకపోతే వికెట్ కీపర్ యాస్తికా భాటియా, ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ ఇద్దరికి గాయాలు తగ్గిపోతే జట్టులో కలుస్తారని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే వారిద్దరూ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవల కారణంగా వేదికను బీసీసీఐ యూఏఈకి మార్చింది. ఈ మహిళా టీ 20 ప్రపంచకప్ లో రెండు గ్రూప్ లు ఉంటాయి. ఏ గ్రూప్ లో 5 జట్లు, బీ గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. ఆ గ్రూప్ లో ఉన్న జట్లు మిగిలిన జట్లతో ఒకొక్క మ్యాచ్ ఆడుతుంది. అలా అక్కడ టాప్ 2 లో ఉన్న జట్లు.. రెండు గ్రూపుల నుంచి సెమీస్ కి చేరతాయి. తర్వాత అక్కడ గెలిచిన వాళ్లు ఫైనల్ ఆడతారు.

Also Read: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?

Advertisement

ఏ గ్రూప్ లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. బీ గ్రూప్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే,  ఏ గ్రూప్ లో ఉన్న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబరు 6న దుబాయ్ లో జరగనుంది. అక్టోబరు 17, 18 మధ్య సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబరు 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మూడు మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉంది.

టీ 20 ప్రపంచకప్ నుకు ఎంపికైన అమ్మాయిల జట్టు ఇదే: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రతి మంధాన ( వైస్ కెప్టెన్), దీప్తీ శర్మ, షఫాలీ వర్మ, రిచాఘోష్, జేమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, ఆశా శోభన, హేమలత, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్ ఉన్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×