E-Paper
Advertisement

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి
Advertisement

IND vs PAK Final:  ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ కు మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇవాళ రాత్రి టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ జ‌రుగ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ టోర్న‌మెంట్ అద్భుతంగా రాణించిన టీమిండ‌యా, పాకిస్థాన్ రెండు జట్లు ఫైన‌ల్స్ కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఈ టోర్న‌మెంట్ లో రెండు సార్లు ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఇక ఇవాళ ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్స్ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Also Read: India vs Pakistan Final: ఇండియాను వ‌ద‌ల‌కండి…చంపేయండి అంటూ రెచ్చిపోయిన పాక్ ఫ్యాన్‌..హరీస్ రవూఫ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి !

దుబాయ్ వేదిక‌గా టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల ఫైట్‌..

Advertisement

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ లో భాగంగా ఇవాళ టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య ఇవాళ ఫైన‌ల్స్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. దుబాయ్ లోని అంత‌ర్జాతీయ స్టేడియంలో వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గునుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం…. ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ పూర్త‌య్యే సారికి దాదాపు అర్థ‌రాత్రి 12 గంట‌లు అవుతుంది. ఈ మ్యాచ్ లో మొద‌ట టాస్ గెలిచిన జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌నుంది. ఇవాళ్టి పిచ్ … మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టుకు అనుకూలంగా ఉండే అవ‌కాశాలు ఉ న్న‌ట్లు చెబుతున్నారు. టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య ఇవాళ ఫైన‌ల్స్ మ్యాచ్ ను సోనీ లీవ్ లో చూడొచ్చు. సోనీ లీవ్ ఓటీటీలో ఉచిత‌గా చూడాలంటే..రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

హార్దిక్ పాండ్యా కు గాయం.. మ్యాచ్ ఆడతాడా?

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు… వస్తున్నాయి. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొన్న జరిగిన మ్యాచ్ సమయంలో ఒకే ఒక్క ఓవర్ వేసిన హార్దిక్.. ఆ తర్వాత బౌలింగ్ చేయలేదు. ఆయనకు చిన్న గాయమైనట్లు తెలుస్తోంది. అందుకే పూర్తిగా విశ్రాంతి ఇచ్చింది టీం ఇండియా. అయితే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా గాయంపై టీమిండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. హార్దిక్ పాండ్యా లాంటి భయంకరమైన ఆల్ రౌండర్ జట్టులో లేకపోతే కష్టమేనని అంటున్నారు. అభిషేక్ శర్మ కోలుకున్నాడని ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని.. తెలుస్తోంది.

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రికార్డులు

టి20 లలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 15 మ్యాచులు జరిగాయి. ఇందులో 12 మ్యాచ్ లలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ కేవలం మూడు మ్యాచ్లలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంటే పాకిస్తాన్ జట్టు పైన టీమిండియా ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.

Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×