E-Paper
Advertisement

Ind vs sa: గంభీర్ మరో ప్రయోగం.. టీమిండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే

Ind vs sa: గంభీర్ మరో ప్రయోగం.. టీమిండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌.. ఇక దక్షిణాఫ్రికాకు చుక్కలే
Advertisement

Ind vs sa: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} 2025-27 సైకిల్ లో భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా.. భారత జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొంది చారిత్రక విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరింది.

Also Read: Vaibhav Suryavanshi: 200 పరుగులు చేసినా, మా అయ్య ఊరుకోడు

Advertisement

ఇక తొలి టెస్ట్ లో ఓటమి అనంతరం.. ఇప్పుడు గౌహతిలో జరగబోతున్న రెండోవ టెస్ట్ కి సిద్ధమవుతుంది భారత్. అయితే మంగళవారం రోజు ఈడెన్ గార్డెన్స్ లో తమ మొదటి ట్రైనింగ్ సెషన్ లో భారత జట్టు పాల్గొంది. ఈ ప్రాక్టీస్ సెషన్ లో ఓ ఆసక్తికర సంఘటన క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రాక్టీస్ లో మిస్టరీ స్పిన్నర్:

తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ల ధాటికి భారత జట్టు ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బంతి గింగిరాలు తిరిగే పిచ్ లను తయారు చేసే విధానాన్ని భారత్ కొనసాగిస్తుంది. తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన తరువాత.. భారత ఓటమికి పిచ్ ని నిందించడానికి నిరాకరిస్తూ.. బ్యాటర్లకు తిరిగే పిచ్ లపై ఎలా ఆడాలో తెలిసి ఉండాలని అన్నారు గంభీర్. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు గంభీర్. అలాగే భారత స్పిన్ విభాగాన్ని మెరుగుపరిచేందుకు ఓ మిస్టరీస్ స్పిన్నర్ ని రంగంలోకి దించాడు. ఈ క్రమంలోనే మంగళవారం రోజు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మైత్రి {WD} తో బౌలింగ్ చేయించాడు గంభీర్. రెండు చేతులతో బౌలింగ్ చేయగల ప్రత్యేకత కౌశిక్ మైత్రీది. ఎడమచేతి బ్యాటర్లకు కుడి చేతితో, కుడి చేతి బ్యాటర్లకు ఎడమ చేతితో ఇతడు బౌలింగ్ చేయగలడు. దేశవాళీ క్రికెట్ లో తన అద్భుత ప్రదర్శనల కారణంగా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

బెంగాల్ కి చెందిన కౌశిక్:

Advertisement

కౌశిక్ మైత్రి బెంగాల్ కి చెందిన ఓ దేశవాళి క్రికెట్ ఆటగాడు. ఇతడు అండర్ – 19, అండర్ – 23, అండర్ – 25 జట్లకు ఆడాడు. అలాగే భారత దేశవాళి సర్క్యూట్ లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ అయిన ఇతడు.. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్తో డాగ్స్ బౌలర్. కౌశిక్ మైత్రి ఇప్పటివరకు అంతర్జాతీయంగా భారతదేశ జాతీయ జట్టు తరఫున ఆడలేదు.

Also Read: IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

కానీ ఇతడి అద్భుత ప్రదర్శనను గమనించిన భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతున్న రెండవ టెస్ట్ కోసం కేవలం ఇతడిని ప్రాక్టీస్ లో వాడుకున్నాడు. ఇక ఈరోజు భారత జట్టు గౌహతి కి పయనం కానుంది. నవంబర్ 22 నుండి భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×