E-Paper
Advertisement

Ind vs Wi live on jio Movies : క్రికెట్ లవర్స్‌కు జియో సినిమా మరో ఆఫర్..

Ind vs Wi live on jio Movies  : క్రికెట్ లవర్స్‌కు జియో సినిమా మరో ఆఫర్..
Advertisement
Ind vs Wi

Ind vs Wi live on jio Movies : ఈరోజుల్లో ఓటీటీలు అనేవి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అన్ని విధాలుగా తమ సబ్‌స్క్రైబర్లకు ఎంటర్‌టైన్మెంట్ అందించాలని ప్రయత్నిస్తున్నాయి. సినిమాల తర్వాత స్పోర్ట్స్ అనేది ముఖ్యమైన ఎంటర్‌టైన్మెంట్. అందుకే స్పోర్ట్స్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ పోటీపడుతున్నాయి. అందులో ముందుగా జియా సినిమా అనేది ఈ అవకాశాన్ని ఇతర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు ఇవ్వకుండా పోటీపడుతోంది.

Advertisement

త్వరలోనే టీమిండియా.. వెస్టిండీస్ లూర్‌ను ప్లాన్ చేస్తోంది. ఆ టూర్‌‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లను ప్రచారం చేయడానికి జియో సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో సినిమా అనేది ఎన్నో విధాలుగా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్ అందించింది. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా స్ట్రీమ్ చేయడంతో చాలామంది ఇది ఫేవరెట్‌గా మారిపోయింది. దీంతో పాటు మరెన్నో ఆఫర్లను క్రికెట్ లవర్స్‌కు అందిస్తోంది ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్.

వెస్టిండీస్‌లో దాదాపు నెలకు పైగా టీమిండియా ఉండనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటన్నింటిని స్ట్రీమ్ చేయడానికి జియో సినిమా సిద్ధంగా ఉందని వయాకామ్ 18 ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్‌లకు సంబంధించిన కామెంటరీని కేవలం ఇంగ్లీష్, తెలుగు మాత్రమే కాకుండా హిందీ, భోజ్‌పూరీ, పంజాబీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా వినే సౌలభ్యం లభిస్తుంది.

Advertisement

జులై 12 నుండి ఆగస్ట్ 13 వరకు వెస్టిండీస్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు అన్నీ జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమ్ అవ్వనున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా స్ట్రీమ్ చేయడం వల్ల జియో సినిమా రికార్డ్ సాధించిందని, ఇప్పుడు దానికి ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య 12 కోట్లు అని యాజమాన్యం వెల్లడించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 3.21 కోట్ల మంది లైవ్ స్ట్రీమ్ చేశారని, ఇది సరికొత్త రికార్డ్ అని వయాకామ్ 18 సంతోషం వ్యక్తం చేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×