E-Paper
Advertisement

INDW Vs SLW : భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

INDW Vs SLW : భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
Advertisement

INDW Vs SLW :  భార‌త ఉమెన్స్ వ‌ర్సెస్ శ్రీలంక ఉమెన్స్ మ‌ధ్య 5 టీ 20ల సిరీస్ ను భార‌త అమ్మాయిలు వైట్ వాష్ చేశారు. తాజాగా చివ‌రి టీ 20లోనూ అద‌ర‌గొట్టి 15 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించారు. 176 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన లంక 160 7 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త జ‌ట్టులో దీప్తి, అరుంధ‌తి, స్నేహ్ రాణా, వైష్ణ‌వి, శ్రీ చ‌ర‌ణి, అమ‌న్ జోత్ త‌లో వికెట్ తీశారు. దీంతో భార‌త జ‌ట్టు 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ప్ర‌తీ మ్యాచ్ ల్లో కూడా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసి ఔరా అనిపించారు. టీమిండియా వైట్ వాష్ చేయ‌డం తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

భార‌త జ‌ట్టు 15 ప‌రుగుల తేడాతో విజ‌యం

Advertisement

ఐదో మ్యాచ్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 15 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 175 ప‌రుగులు చేసింది. దీంతో 176 ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగింది శ్రీలంక‌. కేవ‌లం 160 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో ఓట‌మి పాలైంది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో హాసినీ పెరీర‌రా (65) ఇమేషా దులాని (50) రాణించినా జ‌ట్టుకు విజ‌యాన్ని మాత్ం అందించ‌లేక‌పోయారు. భార‌త మ‌హిళా బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ‌, అరుంధ‌తి రెడ్డి, స్నేహ్ రానా, వైష్ణ‌వి శ‌ర్మ‌, శ్రీచ‌ర‌ణి, అమ‌న్ జ్యోత్ కౌర్ త‌లో వికెట్ తీసి విజ‌యానికి స‌హ‌క‌రించాడు.

సిరీస్ క్లీన్‌స్వీప్

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంక‌తో జ‌రిగిన చివ‌రి టీ20లో టీమిండియా ఓ మోస్తారుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువ‌నంత‌రం వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచ‌రీతో చెల‌రేగింది. 43 బంతుల్లో 68 ప‌రుగులు చేసింది. చివ‌ర‌ల్లో అమ‌న్ జోత్ కౌర్ 18 బంతుల్లో 21 ప‌రుగులు చేసింది. అరుంధ‌తి రెడ్డి 11 బంతుల్లో 27 నాటౌట్ బ్యాట్ తో ఝులిపించారు. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో షెఫాలీ వ‌ర్మ 5, ఆరంగేట్రం ప్లేయ‌ర్ క‌మలిని 12, హ‌ర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శ‌ర్మ 7, స్నేహ్ రాణా 8 నాటౌట్ గా నిలిచింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో క‌విష దిల్హ‌రి, ర‌ష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆట‌ప‌ట్టు త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. నిమిష మ‌దుష ని ఓ వికెట్ ప‌డ‌గొట్టింది. ఈ టీ 20 సిరీస్ లో భార‌త్ కు శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. చివ‌రి రెండు మ్యాచ్ ల్లో కాస్త ప‌ర్వాలేద‌నిపించింది. కానీ తొలి 3 టీ 20 మ్యాచ్ ల్లో మాత్రం శ్రీలంక ఘోరంగా ఓట‌మి పాలైంది. దీంతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. శ్రీలంక మ‌హిళ‌లు పోరాడిన‌ప్ప‌టికీ వారి పోరాటం ఎంత సేపు భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల కింద నిల‌వ‌లేక‌పోయింది.

Advertisement

Also Read : MS Dhoni : ధోని కారులో సిగరెట్… సాక్షి స్మోక్ చేస్తుందా!

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×