E-Paper
Advertisement

IND VS SA T20I Series: రేప‌టి నుంచే 5 టీ20ల సిరీస్‌..మ్యాచ్ టైమింగ్స్, షెడ్యూల్‌..ఉచితంగా ఎలా చూడాలంటే

IND VS SA T20I Series: రేప‌టి నుంచే 5 టీ20ల సిరీస్‌..మ్యాచ్ టైమింగ్స్, షెడ్యూల్‌..ఉచితంగా ఎలా చూడాలంటే
Advertisement

IND VS SA T20I Series: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్టులతో పాటు వన్డే సిరీస్ కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి టి20 సిరీస్ పైన పడింది. మొదటి జరిగిన టెస్ట్ సిరీస్ దక్షిణాఫ్రికా గెల్చుకోగా, వన్డే సిరీస్ లో టీం ఇండియా ప్రతికారం తీర్చుకుంది. 3 వ‌న్డేల‌ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంటు రేపటి నుంచే ప్రారంభం కానుంది.

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

రేపటి నుంచి 5 టీ20ల సిరీస్, షెడ్యూల్ ఇదే

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానంది. ఈ మేరకు ఇప్పటికే ముహూర్తం ఖరారు అయింది. రేపు అంటే డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా మొట్ట మొదటి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం కానుంది. అంటే 6:30 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇలా 5 టీ20 లు కూడా సాయంత్రం ఏడు గంటలకే ప్రారంభమవుతాయి. రెండవ టి20 డిసెంబర్ 11వ తేదీన చండీగఢ్ వేదికగా నిర్వహించనున్నారు. మూడవ వన్డే డిసెంబర్ 14వ తేదీన ధర్మశాల వేదికగా జరుగుతుంది. ఇక నాలుగో వన్డే డిసెంబర్ 17వ తేదీన లక్నో వేదికగా నిర్వహించనున్నారు. చిట్ట చివరి టీ20 డిసెంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రాండ్గా జరగనుంది.

సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా

దక్షిణాఫ్రికా తో జరిగే ఐదు టీ20 ల సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న గిల్ రావడంతో, అతడు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా జియో హాట్ స్టార్ లో ఎప్పటిలాగే రానున్నాయి. సబ్స్క్రిప్షన్ (SUBSCRIPTION) చేసుకున్న వాళ్లకు ఉచితంగా ప్రసారాలు వస్తాయి. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు తిలకించవచ్చు.

Advertisement

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, క్వింటన్ డి కాక్ (కీప‌ర్‌), డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, లుంగీ ఎన్‌గిడి, అన్రిచ్ సెయింట్ నోర్ట్‌జే, అన్రిచ్ ఎస్ నోర్ట్‌జే.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×