E-Paper
Advertisement

Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

Ind vs SA Super 8:  ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !
Advertisement

Ind vs SA Super 8: టి20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 లో ( T20 World Cup 2026 tournament ) టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎవరు ఊహించని ఓటమిని చవి చూసింది టీమిండియా ( Team India ). సఫారీల  ( South Africa) చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది. బౌలింగ్ లో తేలిపోయిన టీమిండియా.. బ్యాటింగ్ లో ఇంకా దారుణంగా విఫలమైంది. మరోసారి అభిషేక్ శర్మ తొందరగానే వికెట్ సమర్పించుకోగా.. ఈ సారి ఇషాన్ కిషన్ డక్ ఔట్ అయ్యాడు. అటు తిలక్ వర్మ కూడా చేతులెత్తేశాడు. ఇలా ప్లేయర్లు అంద‌రూ విఫలం కావడంతో సూపర్ 8 మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 111 పరుగులకు ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. దీంతో 76 పరుగులతో టీమిండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణాఫ్రికా. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు గల్లంతు అయ్యాయి.

Also Read: Ban Players Coma: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఎఫెక్ట్..సంక్షోభంలో బంగ్లాదేశ్ క్రికెట్‌…కోమాలోకి వెళ్లిన‌ ఇద్ద‌రు ఆట‌గాళ్లు

13 మ్యాచ్ ల తర్వాత టీమిండియా దారుణ ఓటమి

Advertisement

టి20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణయిత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే డేవిడ్ మిల్లర్, స్టబ్స్, బ్రెవిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా 187 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయింది. 18.5 ఓవర్లు ఆడింది సూర్య కుమార్ యాదవ్ సేన. ఈ నేపథ్యంలోనే 111 పరుగుల వద్ద కుప్ప కూలింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ మ్యాచ్ లో శివం దుబే మినహా ఏ ఒక్క ఆటగాడు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో దక్షిణాఫ్రికా అవలీలగా విజయం సాధించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా 12 టీ20 ల‌లో విజ‌యం సాధించిన టీమిండియా స్పీడ్ కు బ్రేక్ ప‌డింది.

టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు గల్లంతు

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ 8 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది టీం ఇండియా. దీంతో టీమ్ ఇండియా సెమిస్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా గెలిచి ఉంటే, సెమీస్ ఈజీగా వెళ్లేది. కానీ ఇప్పుడు టీమిండియా ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. సూప‌ర్ 8 లో మ‌రో రెండు మ్యాచ్ ల‌లో క‌చ్చితంగా గెలిస్తేనే టీమిండియాకు సెమీస్ ఛాన్స్ ఉంటుంది. లేక‌పోతే ఇంటికి వెళ్లాల్సిందే.

Advertisement

Also Read: NZ vs Pak Super 8: కొంప ముంచిన వ‌ర్షం, తొలి సూప‌ర్ 8 మ్యాచ్ ర‌ద్దు..పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×