E-Paper
Advertisement

Ind vs SA 3rd ODI: 2 ఏళ్ల‌ త‌ర్వాత టాస్ గెలిచిన టీమిండియా..ఎగిరి గంతేసిన కేఎల్ రాహుల్‌, ప్లేయ‌ర్లు

Ind vs SA 3rd ODI: 2 ఏళ్ల‌ త‌ర్వాత టాస్ గెలిచిన టీమిండియా..ఎగిరి గంతేసిన కేఎల్ రాహుల్‌, ప్లేయ‌ర్లు
Advertisement

Ind vs SA 3rd ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ చిట్ట చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట ద‌క్షిణాఫ్రికా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. దాదాపు 20 మ్యాచ్ ల‌ తర్వాత టీమిండియా టాస్ గెలవడం జరిగింది. అంటే రెండు సంవత్సరాల 21 రోజుల తర్వాత వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచింది. ప్రతిసారి ప్రత్యర్థి జట్టు టాస్ గెలవడంతో టీమిండియా చాలా మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. అయితే ఇవాళ టీమ్ ఇండియా టాస్ గెలవడంతో కచ్చితంగా సిరీస్ గెలుస్తుందని అందరూ అంటున్నారు. అటు రాహుల్ టాస్ గెలవడంతో టీమిండియా జట్టులో సంబరాలు నెలకొన్నాయి.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ పక్కా

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు దాంట్లో మధ్య రెండు వన్డేలు పూర్తయ్యాయి. మొదటి వన్డేలో టీమిండియా విజయం సాధించగా రెండవ నెల దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ గెలిచిన జట్టు ట్రోఫీ అందుకోనుంది. దీంతో అందరిచూపు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పైన ఉంది. ఇప్పటికే రెండు వరుసగా సెంచరీలు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఇవాళ కూడా మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తాడని అంటున్నారు. అటు రోహిత్ శర్మ కూడా టచ్ లోకి వస్తే టీమిండియా గెలవడం గ్యారెంటీ అంటున్నారు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ ప్రసారాలు వస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. టీమిండియాతో జరుగుతున్న ఈ మూడవ వన్డేలో దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా దూరమవుతున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్లు నాండ్రే బర్గర్ తో పాటు టోనీ డి జోర్జ్ ఇద్దరు మూడవ వన్డే కు మిస్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది టీమిండియా కు చాలా అడ్వాంటేజ్ కానుంది.

Also Read: MS Dhoni: గంబీర్ సేఫ్…బీసీసీఐతో అజిత్ అగార్కర్ గొడవ, రాజీనామా చేయనంటూ పట్టు, ధోనికి ఆ పోస్ట్ ?

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు

Advertisement

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, KL రాహుల్(w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×