E-Paper
Advertisement

IND VS SA 2nd Test: ద‌క్షిణాఫ్రికా మ‌రో విజ‌యం.. సొంత గ‌డ్డ‌పై మ‌రో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా

IND VS SA 2nd Test: ద‌క్షిణాఫ్రికా మ‌రో విజ‌యం.. సొంత గ‌డ్డ‌పై మ‌రో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా
Advertisement

IND VS SA 2nd Test: దక్షిణాఫ్రికా తో జరిగిన రెండవ టెస్ట్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది. 549 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. చెత్త ప్రదర్శనతో అత్యల్ప స్కోరుకే ఆల్ అవుట్ అయ్యింది. సఫారీ బౌలర్ల ధాటికి విలవిలలాడిన భారత జట్టు.. ఐదవ రోజు రెండవ సెషన్ లోనే కుప్ప కూలింది. ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.

Also Read: Suresh Raina: టీమిండియా ప్లేయర్లు దద్దమ్మలాగా ఆడితే, గంభీర్ ఏం చేస్తాడు

చెలరేగిన సైమన్:

Advertisement

రవీంద్ర జడేజా {54} మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ 6 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, ముత్తుస్వామి, మార్కో చెరో వికెట్ పడగొట్టారు. దీంతో సఫారీలు 408 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో సిరీస్ ని 2-0 తో క్లీన్ స్వీప్ చేశారు. రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులతో 5వ రోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకి ఆరంభం నుండే షాక్ లు తగిలాయి.

నాలుగవ రోజు ఓపెనర్లు యశస్వి జైష్వాల్ {13}, కేఎల్ రాహుల్ {6} పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఐదవ రోజు తొలి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయి డ్రా కోసం పోరాడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి సెషన్ ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి భారత జట్టు 90 పరుగులు చేసింది. ఇక రెండవ సెషన్ లో ఆల్ అవుట్ కాకుండా మరో అరవై ఓవర్లు అడగలిగితే మ్యాచ్ డ్రా అవుతుందన్న నేపథ్యంలో.. టీమిండియా ప్లేయర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. రవీంద్ర జడేజా {54}, వాషింగ్టన్ సుందర్ {16}, రిషబ్ పంత్ {13}, సాయి సుదర్శన్ {14}, యశస్వి జైస్వాల్ {13}.. మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

Advertisement

 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు:

గౌహతి టెస్ట్ లో భారత ఓటమితో పాయింట్ల పట్టికలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. నాలుగు మ్యాచ్ లలో ఆడి అన్నింటిలోనూ గెలుపొందింది. అందువల్ల అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది. మూడవ స్థానాన్ని శ్రీలంక సాధించింది. అయితే ఇప్పుడు గౌహతి టెస్టులో భారత్ ఓడిపోయిన కారణంగా.. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ తో సమంగా నిలవడం కూడా కష్టంగా కనిపిస్తోంది.

Also Read: Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొల‌గించాల్సిందే… మా కెరీర్లు సంక‌నాకిపోతున్నాయి !

ఎందుకంటే మ్యాచ్ ల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఓటముల సంఖ్య నాలుగు కంటే పెరగడం వల్ల పాకిస్తాన్ కంటే దిగువ స్థానానికి జారిపోతుంది. ఇలాంటి పరిస్థితి డబ్ల్యూటీసి రేసులో భారత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచబోతోంది. ఇకనుండి జరగబోయే సిరీస్ లలో ఎటువంటి తప్పు జరిగినా భారత జట్టు గమ్యం మరింత కఠినంగా మారనుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×