E-Paper
Advertisement

Ind vs SA 2nd ODI: టీమిండియా చెత్త ఫీల్డింగ్‌..రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం

Ind vs SA 2nd ODI: టీమిండియా చెత్త ఫీల్డింగ్‌..రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం
Advertisement

Ind vs SA 2nd ODI:  టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ టోర్న‌మెంట్ లో మొద‌టి వ‌న్డే పూర్తి కాగా, నేడు మ‌రో వ‌న్డే జ‌రిగింది. రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జ‌రిగిన రెండో వ‌న్డే చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠంగా భ‌రితంగా మారింది. అయితే, చివ‌రి క్ష‌ణంలో ఈ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను విజ‌యం వ‌రించింది. చివరి వరకు పోరాడిన దక్షిణాఫ్రికా, టీమిండియా పై ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. ఈ విజయంతో 3 వన్డేలను 1-1 గా సమం చేసింది సఫారీ జట్టు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు చెత్తగా ఫీల్డింగ్ చేశారు. వచ్చిన క్యాచులను వదిలేశారు. అనవసరంగా పరుగులు సమర్పించుకున్నారు. సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే టీమిండియా గెలిచేది. మొదటి మ్యాచ్ గెలిచిన గర్వంతో మన టీమ్ ఇండియా ప్లేయర్లు ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అదునుగా చూసుకున్న దక్షిణాఫ్రికా జట్టు, చాలా జాగ్రత్తగా మొదటి వన్డేలో చేసిన తప్పిదాలు చేయకుండా చివరి వరకు ఆడి గెలిచింది.

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం

Advertisement

రాయపూర్ వేదికగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ రెండవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. 50 ఓవర్లలో ఎప్పటిలాగే 300కు పైగా పరుగులు సాధించింది. ఐదు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా 358 పరుగులు సాధించి దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ ఉంచింది. అయితే ఈ టార్గెట్ దక్షిణాఫ్రికా బ్యాటర్ల హిట్టింగ్ ముందు చిన్నది అయిపోయింది. సెకండ్ బౌలింగ్ చేసే సమయంలో మంచు కూడా బాగా పడింది. దాంతో బౌలర్లకు గ్రిప్ దొరకలేదు. ఇదే అదునుగా చూసుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. 49.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని చేదించింది. దీంతో మన ఇండియా పై నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్ ను కూడా 1-1 తేడాతో సమం చేసింది. ఇక ఈ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య డిసెంబర్ 6వ తేదీన అంటే శనివారం రోజున చిట్ట చివరి వన్డే జరగనుంది. ఈ వన్డేలో గెలిచిన జట్టుకు టైటిల్ దక్కనుంది.

రుతు రాజ్‌, కోహ్లీ, ఐడన్ మార్క్రామ్ సెంచ‌రీల మోత‌

రాయ్ పూర్ వ‌న్డేలో రుతు రాజ్‌, కోహ్లీ, ఐడన్ మార్క్రామ్ సెంచ‌రీల మోత మోగించారు. మొద‌ట టీమిండియా బ్యాటింగ్ చేయ‌గా, ఆ స‌మ‌యంలో రుతు రాజ్‌, కోహ్లీ సెంచ‌రీలు చేశారు. కోహ్లీ 102 ప‌రుగులు సాధించ‌గా, రుతురాజ్ 105 ప‌రుగులు సాధించాడు. కానీ వీళ్ల సెంచ‌రీలు వృధా అయ్యాయి. అటు ఐడన్ మార్క్రామ్ 110 ప‌రుగులు సాధించి, జ‌ట్టును గెలిపించాడు.

Advertisement

 

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×