E-Paper
Advertisement

Ind vs Sa 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే

Ind vs Sa 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే
Advertisement

Ind vs Sa 1st Test: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మొదటి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలిరోజు లంచ్ బ్రేక్ వరకు వికెట్లు పడినప్పటికీ పోరాడిన దక్షిణాఫ్రికా.. లంచ్ బ్రేక్ అనంతరం రెండవ సెషన్ లో ఒక్కసారిగా కుప్పకూలింది. సౌత్ ఆఫ్రికా కుప్పకూలడానికి ప్రధాన కారణం స్టార్ పేసర్ బుమ్రా.

Also Read: Mohammed Shami: బీహార్ ఎన్నిక‌ల‌పై మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వివాద‌స్పద వ్యాఖ్య‌లు.. నితీష్ జీ అంటూ !

Advertisement

మొత్తం 10 వికెట్లలో.. బూమ్రా ఒక్కడే 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అలాగే కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ కి ఒక వికెట్ లభించింది. ఈ క్రమంలో సఫారీలు 159 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి కూడా ఆదిలోనే షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైష్వాల్ కేవలం {12} పరుగులు మాత్రమే చేసి మార్కో యెన్సె న్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

తొలి ఇన్నింగ్స్ రెండవ రోజు:

ఇక 37 – 1 ఓవర్ నైట్ స్కోర్ తో రెండవ రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 14 ఓవర్ల తర్వాత వాషింగ్టన్ సుందర్ {29} వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్.. నాలుగు పరుగులు మాత్రమే చేసిన సందర్భంలో మెడ పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక క్రీజ్ లో నిలదొక్కుకున్న కేఎల్ రాహుల్ {39}, రిషబ్ పంత్ {27} స్వల్ప వ్యవధిలోని పెవిలియన్ చేరారు. ఆ తరువాత రవీంద్ర జడేజా {27} మినహా మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సీమోన్ 4 వికెట్లు, జాన్సెన్ 3, కేశవ్ మహారాజ్, బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇండియాకి 30 పరుగుల స్వల్ప ఆదిక్యం దక్కింది.

Advertisement

 

గిల్ రిటైర్డ్ హర్ట్:

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ మెడనొప్పి కారణంగా మొదటి సెషన్ లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత అతడు బ్యాటింగ్ కి దిగలేదు. తొలి ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేసి హర్మర్ బౌలింగ్ లో అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి దిగిన కెప్టెన్ గిల్.. మెడ పట్టేయడంతో మైదానం వీడాడు. రెండవ రోజు ఉదయం తొలి సెషన్ లోనే ఈ ఘటన జరిగింది.

Also Read: Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌

కేవలం మూడు బంతులు మాత్రమే ఆడిన గిల్.. హర్మర్ బౌలింగ్ లో స్వీప్ షాట్ తో బౌండరీ కొట్టాడు. ఇక అనంతరం బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఒక్కసారిగా గిల్ మెడ పట్టేయడంతో తలను తిప్ప లేకపోయాడు. ఈ క్రమంలో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. భారత జట్టులో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 29 పరుగులతో బౌలర్లలో రాణించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×