E-Paper
Advertisement

Ind vs SA 1st T20I: 100 సిక్స‌ర్ల‌తో పాండ్యా, 100 వికెట్ల‌తో బుమ్రా రికార్డు.. ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా విక్ట‌రీ

Ind vs SA 1st T20I: 100 సిక్స‌ర్ల‌తో పాండ్యా, 100 వికెట్ల‌తో బుమ్రా రికార్డు.. ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా విక్ట‌రీ
Advertisement

Ind vs SA 1st T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య కటక్ వేదికగా జరిగిన టి20 ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లను వందలోపే కట్టడిచేసిన టీమిండియా బౌలర్లు, చుక్కలు చూపించారు. ఈ దెబ్బకు దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో సూర్య కుమార్ యాదవ్ సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 176 పరుగుల టార్గెట్ దక్షిణాఫ్రికా ముందు ఇండియా ఉంచగా, ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాఫ్ అయింది సఫారీ జట్టు. టీమిండియా బౌలర్ల దెబ్బకు 12.3 ఓవర్లలో 74 పరుగులు సాధించిన సఫారీ జట్టు ఆల్ అవుట్ అయింది. దీంతో ఐదు టి20 సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టినట్టు అయింది. అలాగే ఈ సిరీస్ లో 1-0 ముందంజలోకి వచ్చింది ఇండియా.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

101 ప‌రుగుల తేడాతో స‌ఫారీ జ‌ట్టు చిత్తు

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్ సమయంలో హార్దిక్ పాండ్యా ఒక్కడే రాణించినప్పటికీ, బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు. దీంతో తొలి మ్యాచ్ లో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు ఆడిన టీమిండియా జట్టు 6 వికెట్లు నష్టపోయి 175 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 28 బంతుల్లోనే 59 పరుగులతో రెచ్చిపోయాడు. మిగిలిన తిలక్ వర్మ, అక్షర్‌ పటేల్ 20కి పైగా పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో నాలుగు సిక్సర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా, టి20 లలో 100 సిక్సర్లు బాదిన క్రికెటర్ గా కూడా చరిత్ర సృష్టించాడు.

అయితే ఇండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ప్లాప్ అయ్యింది సఫారీ జట్టు. 12.3 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా 74 పరుగులకు కుప్పకూలింది. బ్రేవిస్ ఒక్కడే 14 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. మిగిలిన ఏ ఒక్క బ్యాటర్ రాణించలేకపోయారు. క్వింటాన్‌ డికాక్ అలాగే కేశవ్ మహారాజ్ ఇద్దరు డకౌట్ అయ్యారు. దీంతో 101 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తల రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యాతో పాటు శివం దూబేకు ఒక్కో వికెట్ ప‌డింది.

100 వికెట్లు తీసిన ప్లేయర్ గా బుమ్రా రికార్డు

Advertisement

దక్షిణాఫ్రికాతో క‌ట‌క్ వేదిక‌గా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు డేంజర్ బౌలర్ బుమ్రా. టి20 అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు వందకు పైగా వికెట్లు పడగొట్టిన రెండవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ లిస్టులో అర్ష దీప్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 68 మ్యాచ్ ల‌లో 105 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 81 మ్యాచ్ ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. బుమ్రా తర్వాత హార్దిక్ పాండ్యా 99 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అటు యుజ్వేంద్ర‌ చాహల్ 96 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×