E-Paper
Advertisement

IND VS NZ 5th T20: అర్ష‌దీప్ కు 5 వికెట్లు..వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం

IND VS NZ 5th T20: అర్ష‌దీప్ కు 5 వికెట్లు..వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం
Advertisement

IND VS NZ 5th T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం రోజున ఐదవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ ఐదవ టి20 మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేయడమే కాకుండా, న్యూజిలాండ్ ను కట్టడి చేసింది. ఈ తరుణంలోనే చిట్ట చివరి టీ20 మ్యాచ్ ఏకంగా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇండియా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో విఫలమైన న్యూజిలాండ్, 19.4 ఓవ‌ర్లు ఆడి, 225 ప‌రుగులు మాత్ర‌మే సాధించి ఓడింది. ఈ త‌రుణంలోనే 4-1 తేడాతో 5 టీ20ల సిరీస్ కూడా కైవ‌సం చేసుకుంది సూర్య కుమార్ యాద‌వ్ సేన‌. ఈ భారీ విజ‌యంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో అడుగుపెట్ట‌నుంది టీమిండియా.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

వ‌ర‌ల్డ్ క‌ప్ కంటే ముందు టీమిండియా పెద్ద విజ‌యం

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో ఇండియా బ్యాటింగ్ మొదట చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయిన టీమిండియా, 271 పరుగులు సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా బాగానే ఆడింది. 19.4 ఓవర్లు ఆడింది న్యూజిలాండ్. ఈ నేపథ్యంలోనే 225 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది న్యూజిలాండ్. దీంతో 46 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చాలా ప్రమాదకరంగా ఈ మ్యాచ్ లో ఆడాడు. ఒకానొక సమయంలో అతడు మ్యాజిక్ గెలిపిస్తాడని కూడా అందరూ అంచనా వేసుకున్నారు. కేవలం 38 బంతులు వాడిన ఫిన్ అలెన్ 80 పరుగులు సాధించాడు. అయితే అతన్ని అక్షర్ పటేల్ అవుట్ చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు.

ఐదు వికెట్లతో ఇరగదీసిన అర్షదీప్ సింగ్‌

న్యూజిలాండ్ పై జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో డేంజర్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదట భారీగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్, ఆ తర్వాత ఐదు వికెట్లు పడగొట్టగలిగాడు. నాలుగు ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ 51 పరుగులు ఇవ్వడమే కాకుండా ఐదు వికెట్లు తీసి ఇండియాకు విజయాన్ని అందించాడు. దీంతో అర్షదీప్ సింగ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ద‌క్కింది. అటు గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి అలాగే రింకు సింగ్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×