E-Paper
Advertisement

Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

Ind vs NZ 2nd ODI:  తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు
Advertisement

Ind vs NZ 2nd ODI:  టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య రాజ్ కోట్ లో ఉన్న నిరంజన్ షా స్టేడియం ( Niranjan Shah Stadium, Khandheri, Rajkot ) వేదికగా రెండవ వ‌న్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్, ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇండియా నిర్ణయించిన 284 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి చేదించగలిగింది న్యూజిలాండ్. అయితే ఈ రెండవ వన్డేలో టీమిండియా స్వయంకృపరాధం కారణంగా ఓడిపోయిందని సోషల్ మీడియాలో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ను విలన్ చేస్తున్నారు.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

టీమిండియా ఓటమికి కారణం శుభ్‌మ‌న్ గిల్

Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కారణంగా జట్టు ఓడిపోయిందని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్లేయర్లను వినియోగించుకోవడంలో శుభ్‌మ‌న్ గిల్ దారుణంగా విఫలమయ్యాడని అంటున్నారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ముందుగా బ్యాటింగ్ పంపించలేదని విమర్శలు వస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు ర‌వీంద్ర‌ జడేజాను పంపించాడు. అంటే ఏడవ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కు వచ్చాడు.

దానివల్ల రవీంద్ర జడేజా ఎక్కువ బంతులు అడి, తక్కువ పరుగులు చేశాడు. అదే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి వస్తే , టీమిండియా 300 కు పైగా పరుగులు చేసి ఇవాళ మ్యాచ్ విజయం సాధించేది. ఈ విషయంలో శుభ్‌మ‌న్ గిల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అటు బుమ్రా కు రెస్టు ఉన్న సమయంలో కచ్చితంగా అర్షదీప్ సింగ్ ను తుది జట్టులో వాడుకోవాలి. అలా చేయకుండా ప్రసిద్ధ్ కృష్ణ ను వాడి శుభ్‌మ‌న్ గిల్ పెద్ద మిస్టేక్ చేశాడు. పదేపదే జడేజాను నమ్ముకోకుండా అతని స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను ప్రసిద్ధ్ కృష్ణ వదిలేసాడు. అక్కడ ప్రసిద్ధ్ కృష్ణను కాకుండా రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ను పెట్టాల్సింది. కానీ శుభ్‌మ‌న్ గిల్ అలా చేయలేదు.

నితీష్ కుమార్ రెడ్డికి కేవలం రెండు ఓవర్లేనా ?

Advertisement

వాషింగ్టన్ సుందర్ స్థానంలో దక్కించుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఈ మ్యాచ్ లో ఇచ్చాడు శుభ్‌మ‌న్ గిల్. టీమిండియా ఓడిపోతున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ రెడ్డి ని వాడుకోలేదు. రెండు ఓవర్లు టెస్ట్ చేసి, అతన్నీ పక్కకు పెట్టేశాడు. చివరి వరకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని వాడుకుంటే హార్దిక్ పాండ్యా లాగా బౌలింగ్ చేసి, వికెట్లు తీసేవాడు కావచ్చు. కానీ అలా చేయలేదు శుభ్‌మ‌న్ గిల్. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డిని సరిగ్గా వాడలేదు. ఇక బ్యాటింగ్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కాస్త టచ్ లోకి వస్తే, మ్యాచ్ గెలిచే వాళ్ళం. కేవలం భారం మొత్తం కేఎల్ రాహుల్ పైన పడింది. ఇలా అనేక రకాల కారణాలవల్ల టీమిండియా ఓడిపోయింది.

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×