E-Paper
Advertisement

IND vs ENG 1st Test: మొదటి టెస్ట్…టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్

IND vs ENG 1st Test: మొదటి టెస్ట్…టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్
Advertisement

IND vs ENG 1st Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొన్ని నిమిషాల క్రితమే ఈ టోర్నమెంట్ షురూ అయింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ హెడ్డింగ్ లే లోని లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ గెలిచిన… ఇంగ్లాండ్… మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయబోతోంది. మరికొద్ది క్షణాల్లోనే మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది.

Also Read: Women’s T20 World Cup: ఉమెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే.. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

Advertisement

రంగంలోకి కొత్త ప్లేయర్… జోష్ లో టీమిండియా

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో కొత్త ప్లేయర్ రంగంలోకి దిగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అదరగొట్టిన సాయి సుదర్శన్.. తన తొలి టెస్ట్ మ్యాచ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అతనికి క్యాప్ అందించింది టీం ఇండియా యాజమాన్యం. అలాగే చాలా సంవత్సరాల తర్వాత కరుణ్ నాయక్ జట్టులోకి వస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ కూడా బరిలో దిగుతున్నాడు.

Advertisement

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India Vs England) మధ్య ఐదు టెస్టులు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న ఐదు టెస్టులు… ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు మాత్రమే ప్రారంభమవుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్లు ప్రారంభం అయ్యేవి. కానీ ఇంగ్లాండులో మ్యాచులు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్లు ప్రారంభమై అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న ఐదు టెస్టుల సిరీస్ జియో హాట్ స్టార్, సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. అదే సమయంలో.. డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ ప్రసారాలను అందిస్తున్నారు. డిడి స్పోర్ట్స్ లో టెస్ట్ సిరీస్ ఉచితంగా చూడవచ్చు.

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్లేయర్ల లిస్ట్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్(w), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్(w), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్

Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్‌ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×