E-Paper
Advertisement

ఫాస్ట్ బౌల‌ర్ కు త‌క్కువ, స్పిన్ బౌల‌ర్ కు ఎక్కువ‌..షాహీన్ ప‌రువు తీసిన ఇఫ్తికార్

ఫాస్ట్ బౌల‌ర్ కు త‌క్కువ, స్పిన్ బౌల‌ర్ కు ఎక్కువ‌..షాహీన్ ప‌రువు తీసిన ఇఫ్తికార్
Advertisement

Iftikhar Ahmed:  పాకిస్తాన్ క్రికెటర్లు ఏది చేసినా వైరల్ అవుతూనే ఉంటుంది. రనౌట్స్‌ నుంచి మొదలుకొని, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా హాట్ టాపిక్ అవుతాయి. నిత్యం వార్తల్లో నిలిచేందుకుగాను రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాలకు తెర లేపుతారు పాకిస్తాన్ క్రికెటర్లు. అయితే తాజాగా సొంత బౌలర్ ప‌రువు తీశాడు ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed). షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) లాంటి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ ను… స్పిన్ బౌలర్ అంటూ ఇజ్జత్ తీశాడు. తన దృష్టిలో షాహీన్ అఫ్రిది ఫాస్ట్ బౌలర్ కాదని… వాడు కూడా స్పిన్నరే అంటూ బాంబు పేల్చాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో అవలీలగా సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టగలన‌ని వ్యాఖ్యానించాడు. దీంతో ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ఇఫ్తికార్ అహ్మద్ పై షాహీన్ అఫ్రిది అభిమానులు సీరియస్ అవుతున్నారు. శత్రువు ఎక్కడో ఉండడు.. ఇంట్లోనే ఉంటాడు అంటూ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

షాహీన్ అఫ్రిది ఫాస్ట్ బౌల‌ర్ కాదు, వాడిది కూడా స్పిన్ బౌలింగే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Pakistan Super League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో రోజుకో వివాదం చోటు చేసుకుంటోంది. నసీమ్ షా వివాదాస్పద పోస్ట్ నుంచి మొదలుకొని డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ వరకు ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక వివాదం తెరపైకి వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో… షాహీన్ అఫ్రిది లాంటి ప్రీమియం బౌలర్ పై బాంబు పేల్చాడు ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed). వాడిది ఫాస్ట్ బౌలింగ్ కాదని… తన దృష్టిలో స్పిన్నర్ అంటూ పరువు తీశాడు. వాడు తనకు బౌలింగ్ చేస్తే.. సిక్సర్లు అలాగే బౌండ‌రీలు చాలా సులభంగా కొడతానని హెచ్చరించాడు. కానీ అందరూ షాహీన్ అఫ్రిది ఫాస్ట్ బౌలర్ అని భయపడిపోతారని గుర్తు చేశారు. తనకు అలాంటి భయం ఏదీ లేదని తెలిపారు ఇఫ్తికార్ అహ్మద్.

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆకట్టుకుంటున్న ఇఫ్తికార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed), షాహీన్ అఫ్రిది ఇద్దరూ కూడా అదరగొడుతున్నారు. ఈ సీజన్ లో పేషావర్ జల్మీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇఫ్తికార్ అహ్మద్. ఇతన్ని రూ. 1.8 కోట్లకు సొంతం చేసుకుని పెషావ‌ర్ జల్మీ. అటు లాహోర్ ఖలందర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు షాహీన్ అఫ్రిది. గతంలో కూడా ఇదే జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ప్లాటినం కేటగిరిలో షాహీన్ అఫ్రిదిని అంటిపెట్టుకుని ఉంది లాహోర్.

Advertisement

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×