E-Paper
Advertisement

Team India News : అతని కోసమేనా ? తుది జట్టులో మార్పులు చేస్తారా?

Team India News : అతని కోసమేనా ? తుది జట్టులో మార్పులు  చేస్తారా?
Advertisement

Team India News : వన్డే వరల్డ్ కప్ 2023లో టీమ్ ఇండియా ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలిచి అప్రతిహితంగా సాగిపోతోంది. ఇప్పుడీ టైమ్ లో జట్టు కూర్పును మార్చడం సమంజసం కాదని అందరూ అంటున్నారు. కానీ జట్టులో ఎన్ని మార్పులు చేయవచ్చో బోర్డు పెద్దలు లెక్కలేస్తున్నట్టు తెలిసింది.

ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ ని ఎలాగైనా జట్టులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో జట్టు స్వరూపాన్ని రకరకాలుగా మార్పులు చేర్పులు చేయడానికి చూస్తున్నారని సమాచారం. అయితే వారు చెప్పే లెక్కలు చూస్తుంటే క్రికెట్ పై అసాధారణ మేథస్సు ఉన్నవాళ్లు సైతం అమ్మబాబోయ్ ఇలా క్కూడా చేయవచ్చా? అంటున్నారు.

Advertisement

ఒకసారి ఈ లెక్క చూడండి.. ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ వస్తారు.. ఫస్ట్ డౌన్ కోహ్లీ వస్తాడు. దీనినెవరూ తప్పించలేరు. ఇప్పుడు సెకండ్ డౌన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. తను ప్లేస్ డౌట్ గా ఉంది. కేఎల్ రాహుల్ ని సెకండ్ డౌన్ పంపించే యోచన ఒకటి చేస్తున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వస్తాడు.ఎందుకంటే  ఇంగ్లండ్ తో మ్యాచ్ లో చాలా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడు. ఇది సీక్వెన్స్..

బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి ఫాస్ట్ బౌలింగ్ లో బుమ్రా, షమీ ఉంటారు. ఎందుకంటే షమీ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నాడు. ఇక్కడ సిరాజ్ కు చూస్తే వికెట్లు పడటం లేదు. అందువల్ల తన ప్లేస్ డౌట్ గా కనిపిస్తోంది. స్పిన్ కి వచ్చేసరికి కులదీప్, రవీంద్ర జడేజా ఉన్నారు. మరి ఐదో బౌలర్ ఎవరు? శ్రీలంకతో ఆడే వాంఖేడీ స్టేడియం బ్యాటింగ్ పిచ్ అంటున్నారు కాబట్టి శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి, అతన్ని తీసుకుంటే చివరి వరకు బ్యాటింగ్ బాగుంటుందని బోర్డు ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

Advertisement

అయితే శ్రేయాస్ అయ్యర్ ని తీయడానికి రోహిత్ శర్మ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ బౌలర్ సిరాజ్ ఒక్కడే బలైపోయేలా కనిపిస్తున్నాడు. మూడేళ్ల నుంచి శార్దూల్ ఠాకూర్ ను ఊరికినే ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో, రిజర్వ్ బెంచ్ కి ఎందుకు పరిమితం చేస్తున్నారో తెలీదు. నిజానికి ఫస్ట్ క్లాస్ట్ మ్యాచ్ లో అతనేమంత గొప్ప పెర్ ఫార్మెన్స్ కూడా చేయలేదు. కానీ తనని ఆడించడానికి జట్టు సమతూకాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదని అంతా అంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×