E-Paper
Advertisement

ICC-Bangladesh: బీసీసీఐ దెబ్బ అదుర్స్‌..బంగ్లాదేశ్ పై ఐసీసీ బ్యాన్..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి స్కాట్లాండ్ ఎంట్రీ ?

ICC-Bangladesh: బీసీసీఐ దెబ్బ అదుర్స్‌..బంగ్లాదేశ్ పై ఐసీసీ బ్యాన్..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లోకి స్కాట్లాండ్ ఎంట్రీ ?
Advertisement

ICC-Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఐపీఎల్ పైన పడింది. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడకుండా ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి కూడా లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ ఇచ్చిందట ఐసీసీ. మీరు వాడే నాటకాలు ఇక్కడ సాగబోవని.. మేం చెప్పినట్టు ఫాలో కావాల్సిందేనని ఐసిసి స్పష్టం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. రంగంలోకి కొత్త జట్టు ?

Advertisement

ఇండియాలో జరిగే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలో నిర్వహించాలని ఇటీవల ఐసీసీకి లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే దీనిపై ఐసీసీ స్పందించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్లను పరిశీలించేది లేదని తేల్చి చెప్పిందట. టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ అయిన తర్వాత మార్చడానికి వీలు ఉండదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయినా మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తే, టోర్నమెంట్ నుంచి తప్పిస్తామని వార్నింగ్ ఇచ్చిందట.

తాము చెప్పినట్లు ఆడితేనే సరి, లేకపోతే బ్యాన్ వేస్తామని ఐసిసి హెచ్చరిస్తోందట. నోరు మూసుకొని ఇండియాలో వచ్చి మ్యాచ్ లు ఆడాలని స్పష్టం చేసిందట. అయినప్పటికీ తమ ఆదేశాలు పాటించకపోతే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ టి20 ప్రపంచ కప్ ఆడుతుందని వెల్లడించిందట ఐసీసీ. 2024 t20 ప్రపంచ కప్ లో స్కాట్లాండ్ ప్రాతినిధ్యం వహించింది. కానీ ఈసారి ఆ జట్టు పర్ఫామెన్స్ సరిగ్గా లేక టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు సెలెక్ట్ కాలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే స్కాట్లాండ్ కు అవకాశం రానున్నట్లు చెబుతున్నారు.

టి20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే జరిగే పరిణామాలు

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికే షెడ్యూల్ ఫైనల్ అయిన నేపథ్యంలో ఆయా స్టేడియాల్లో టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోతుందట. అలా దాదాపు ఏడుకోట్లకు పైగా ఆదాయం రిస్క్ లో పడుతుందని చెబుతున్నారు. అలాగే బంగ్లాదేశ్ పైన ఐసీసీ భారీ జరిమానా విధించే ప్రమాదం ఉంటుంది. దాదాపు 500 కోట్ల వరకు వేనుందని అంటున్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కెరీర్ పూర్తిగా నాశనం అవుతుంది.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×