E-Paper
Advertisement

ICC-Bangladesh: బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్‌..ఇక తోక ముడుచుకుని ఇండియా రావాల్సిందే

ICC-Bangladesh: బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్‌..ఇక తోక ముడుచుకుని ఇండియా రావాల్సిందే
Advertisement

ICC-Bangladesh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup tournament 2026) నేపథ్యంలో మొండి పట్టు పట్టిన బంగ్లాదేశ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ తీసుకువచ్చిన డిమాండ్లను పక్కకు పెట్టి, మూసుకొని ఇండియాకు రావాల్సిందేనని ఐసీసీ వెల్లడించింది. ఎప్పుడు పడితే అప్పుడు రూల్స్, వేదికలు మార్చడానికి ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కాదంటూ ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వేదికలు మార్చడానికి అస్సలు కుదరదని, వెంటనే ఇండియాకు రావాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ ఇండియాలో పర్యటించకుండా ఉంటే, రూల్స్ ప్రకారం బంగ్లాదేశ్ పాయింట్లు కట్ చేస్తామని.. హెచ్చరించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అదే జరిగితే ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ఎలిమినేట్ కావలసి వస్తుంది. అంతేకాదు కోట్లలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన ఐసీసీ

Advertisement

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రాసిన లేఖపై తాజాగా ఐసిసి స్పందించింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup tournament 2026) నేపథ్యంలో వేదికలు మార్చడానికి ఇది సమయం కాదని.. ఇండియాలో బంగ్లాదేశ్ కచ్చితంగా పర్యటించాల్సిందేనని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. అలా కాదని ఇండియాకు బంగ్లాదేశ్ రాకపోతే, రూల్స్ ప్రకారం ఫోర్ఫిట్ పాయింట్లు కట్ చేస్తామని హెచ్చరించింది ఐసిసి. బంగ్లాదేశ్ ప్లేయర్లు ఇండియాలో పర్యటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC Jay Shah). కాబట్టి ఎలాంటి భయం లేకుండానే ఇండియాలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్లేయర్లను కోరింది ఐసీసీ. మరి దీనిపై బంగ్లాదేశ్ (Bangladesh Team) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బంగ్లాదేశ్‌కు షాక్‌..చ‌క్రం తిప్పిన ICC Boss జై షా

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన నేపథ్యంలో ఐసీసీ రిజెక్ట్ చేసింది. అయితే దీని అంతటికి కారణం ఐసీసీ బాస్ అమిత్ షా కుమారుడు జై షా అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇండియాకు చెందిన జై షానే, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాస్ గా ఉన్నారు. ఆయన ఎంత చెబితే అంతా నడుస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందుకే ఆయన బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా, ఇండియాకు అనుకూలంగా ఐసీసీలో తతంగం నడిపినట్లు చర్చ జరుగుతోంది. అందుకే బంగ్లాదేశ్ పెట్టిన డిమాండ్లను ఐసీసీ రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×